ఆ టీవీ నటి ఫిజిక్ చూసి బన్నీ ఫ్లాట్

Share this News:
allu
అల్లు అర్జున్ కు యూత్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. టాప్ హీరోయిన్లతో కలిసి స్టెప్టులేసే బన్నీ ఇప్పుడు ఓ టీవీ నటితో రొమాన్స్ కు రెడీ అవుతున్నాడట. అవును….. బన్నీ కొత్త సినిమాలో హిందీ టీవీ నటిని హీరోయిన్ గా తీసుకుంటున్నారట. బోయపాటి శ్రీను లాంటి పెద్ద డైరెక్టరు తీస్తున్న ఈ సినిమాలో బుల్లి తెర నటిని బుక్ చేసినట్లు తెలుస్తోంది.
హిందీలో పాపుల్ అయిన టీవీ నటి సోనారికా భడోరియా బన్నీ, బోయపాటిల కొత్త సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది. దేవన్ కి దేవ్ మహదేవ్ అనే హిందీ సీరియల్ తో పాపులర్ అయిన సోనారిక ప్రస్తుతం తెలుగులో నాగ శౌర్య సరసన జాదూగాడు చిత్రంలో నటిస్తోంది. ఇదే ఆమె తొలి సినిమా. ఇంద్రజిత్ అనే తమిళ సినిమాలోనూ నటిస్తోంది. అందం, నటనతో కత్తిలాంటి ఫిజిక్ ఉండడమే ఆమెకు బన్నీ సరసన ఛాన్సు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఆమె ఫొటోలు చూసిన అల్లు అర్జున్ నోట మాటరాలేదని….. వెంటనే ఓకే చెప్పేశాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
కాగా ఈ సినిమా బన్నీ బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయే కరెక్టు కథతో తీస్తున్నామని… ప‌క్కా అవుట్ అండ్ అవుట్ హీరోయిజం వున్న స్టోరి అని… ఫుల్ లెంగ్త్ ల‌వ్ అండ్ రొమాన్స్ ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు బోయపాటి చెబుతున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*