ఐటీ శాఖ మరో 31 మంది పరువు తీసింది

Share this News:
పేరుకు కంపెనీలు పెట్టి.. పెద్దఎత్తున వ్యాపారం చేసే వారు. తీరా ఆదాయపన్ను కట్టాల్సి వస్తే మాత్రం డబ్బుల్లేవంటూ ఖాళీ చేతులు చూపించటం మామూలే. ఇలాంటి పన్ను ఎగవేత రాయుళ్లకు బుద్ధి వచ్చేలా చేసేందుకు ఐటీ శాఖ ఈ మధ్య కాలంలోకాస్తంత వినూత్నంగా ముందుకెళ్లి.. అలాంటి పన్ను ఎగవేత దారుల పేర్లు బయటకు వెల్లడించటం తెలిసిందే.
ఆ మధ్యన ఇలానే కొన్ని కంపెనీల పేర్లను బయటపెట్టిన ఐటీ శాఖ.. తాజాగా 31 కంపెనీల వివరాల్ని బయటపెట్టి.. వారు పన్ను ఎగవేతదారులుగా వెల్లడించింది. ఈ 31 సంస్థలు ఐటీ శాఖకు రూ.1500 కోట్ల మేర పన్ను చెల్లించాల్సి ఉంది. గతంలో రూ.500 కోట్ల మేర బకాయిల లిస్ట్‌ ప్రకటించిన ఐటీ శాఖ.. తాజాగా 31 మంది పరువు బజార్లో పెట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కడితే బాగుంటుంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*