బాబాయ్ సినిమాకు అబ్బాయే నిర్మాత

Share this News:
balakrishna-100-th-movieబాలకృష్ణ త్వరలో కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న100వ సినిమా పేరేంటో తెలిసింది… దర్శకుడు బోయపాటి అనీ తెలుసు.. మరి ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు….? ఈ ప్రశ్న అభిమానులను తొలుస్తోంది. అయితే… బాలయ్య 100వ సినిమాను నందమూరి వంశంలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న హీరో కల్యాణ్ రామ్ నిర్మిస్తారట.
బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి హిట్ చిత్రాలు అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 100వ సినిమా నిర్మాణ బాధ్యతలు దక్కించుకోవడానికి ప్రముఖ నిర్మాతలందరూ ప్రయత్నిస్తున్నారు. చివరకు ఈ అవకాశం కళ్యాణ్ రామ్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫైనల్ గా ‘నందమూరి తారక రామారావు ఆర్ట్స్’ బేనర్లోనే ఈ చిత్రం నిర్మాణం కాబోతోందని అంటున్నారు. బాలయ్య ఈ చిత్రాన్ని తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అంకితం ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇలాంటి ప్రతిష్టాత్మక సినిమాను తమ ఫ్యామిలీ బేనర్లోనే చేస్తేనే బావుంటుందని బాలయ్య భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అఫీషియల్ ప్రకటన వెలువడితే తప్ప ఏ విషయం అనేది తేలనుంది. బాలయ్య 100వ సినిమా అంటే ఎలా ఉండాలి? అదిరిపోవాలి…టైటిల్ ఇప్పటి వరకు వచ్చిన టైటిల్స్ అన్నింటికీ ధీటుగా, బాలయ్య కెరీర్‌కు అద్దం పట్టే విధంగా ఉండాలి. అందుకే ఈ చిత్రానికి ‘చరిత్రకొక్కడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*