మరో భారీ లక్ష్యంపై కన్నేసిన మజ్లిస్ పార్టీ! 

Share this News:

ఇప్పటికే మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దశాబ్దాలుగా హైదరాబాద్ పరిధిని దాటలేకపోయిన ఈ పతంగి పార్టీ ఇప్పుడు మరాఠా గడ్డపై రెపరెపలాడుతోంది! మొన్నటి మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ పార్టీ రెండు అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఏదో నామమాత్రపు పోటీ అనుకొంటే.. మజ్లిస్ ఏకంగా రెండు చోట్ల జయకేతనం ఎగరేసింది.

తద్వారా పాతబస్తీ ఆవల కూడా గెలిచింది. తాజాగా ఈ పార్టీ ఔరంగబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. అక్కడ పాతిక వార్డులను గెలుచుకొని రెండో అతిపెద్ద పార్టీగా నిలబడింది మజ్లిస్. ఇలాంటి నేపథ్యంలో మజ్లిస్ మరో కొత్త లక్ష్యాన్ని పెట్టుకొంది. వచ్చే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించాడు.

2017లో బృహాన్ ముంబాయ్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లోమజ్లిస్ పోటీ చేయనున్నాదట, మరి ఔరంగబాద్ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతోనే మజ్లిస్ ఇలా మరో ఎన్నికలపై దృష్టి సారించినట్టుగా ప్రకటన చేసుకొందని అనుకోవాలి. మరి ప్రతి మున్సిపాలిటీనూ ఔరంగబాద్ కాకపోవచ్చనే విషయాన్ని కూడా మజ్లిస్ గుర్తుంచుకోవాలి. ఈ హైదరాబాద్ నగర పార్టీని ముంబై మహానగర పౌరులు ఏ మేరకు ఆదరిస్తారో!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*