తానా సభలు ఎలా ఉండబోతున్నాయ్ ?

Share this News:
tana
డెట్రాయిట్ లో జూలై 2,3,4 తేదీలలో జరగబోతున్న తాన మహాసభలకు సాంస్కృతిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. TANA ప్రెసిడెంట్ శ్రీ మోహన్ నన్నపనేని గారు మరియు కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీ గంగాధర్ నాదెండ్ల గారి ఆధ్వైర్యం లో జరుగుతున్నా 20 వ తాన మహా సభల కోసం భారత దేశం నుండి వివిధ రంగాల ప్రముకులను ఆహ్వానిస్తున్నారు. TANA మహా సభల కొరకు విభిన్నమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు సాంస్కృతిక విభాగం చైర్ పర్సన్ శ్రీ లీల ప్రసాద్ గారు చెప్పారు.
publicity టీం సాంస్కృతిక విభాగం సభ్యులతో ఇక్కడ  జరిగే ఏర్పాట్లు గురించి ముచ్చటించింది.
ఆ వివరాలు….

1)    తానా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సారి ఎలా ఉండబోతున్నాయి?

తానా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సారి విన్నూత్నమైన రీతిలో రూపు దిద్దుకొంటున్నాయి. ఎన్నో అద్భుతమైన, విభిన్నమైన కార్యక్రమాలు  ప్రదర్శింపబోతున్నాము  . ఒక్కటి మాత్రం ఖచ్చితంగా  చెప్పగలం. ఈ తానా మహాసభలకు విచ్చేసిన ప్రతి  ఒక్కరిని ఆద్యంతం అలరించే విధంగా  కార్యక్రమాలు ఉంటాయి

2) మీ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?

శ్రీ గంగాధర్ నాదెళ్ళ మరియు శ్రీ మోహన్ నన్నపనేని ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ చాల చురుకుగా సాగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు దాదాపు 60 మందికి పైగా కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇతర కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో పనులు నిరాటంకంగా సాగుతున్నాయి
3) గతానికీ ఇప్పటికీ మీ కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి?

గతంలో జరిగిన మహాసభల లోటు పాట్లను పరిశీలించి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే ఇంతకూ ముందెన్నడూ చూడని కార్యక్రమాలు ఈసారి ప్రేక్షకులు చూడబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే “అధ్బుతః” అనే విధంగా ఉంటాయి
4) ఈ సారి కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించే కార్యక్రమంగా ఏది నిలుస్తుందని మీ అభిప్రాయం?

ముందు చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమం అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. సినీ రంగం నుంచి ప్రముఖ కమెడియన్స్, ప్రముఖ హీరో హీరోయిన్ తో కార్యక్రమాలు, ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి (ప్రేక్షకులు ఉత్కంటతో చూసే విధంగా ఉంటాయి)

 

 

5) ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విధి విధానాలు ఏమిటి? కార్యక్రమాల్లో పాల్గొనడానికి membership కాకుండా వేరే fees ఎమైనా ఉందా?
తానా కార్యక్రమాల్లో పాల్గొనడానికి విధి విధానాలు, మరియు ఎంట్రీ ఫి వివరాలు అన్ని తానా వెబ్ సైట్ లో పొందవచ్చు  http://www.tana2015.org/

6) ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొనేందుకు సంబంధించిన విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? (websites, contact persons etc.)
ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొనేందుకు అన్ని వివరాలు ఈ లింక్ ద్వారా పొందవచ్చు http://www.tana2015.org/content/doc/guidelines-tana-culturalprogram.pdf మీ సందేహాలు ఈ email కి పంపండి tanacultural2015@gmail.com

 

7) తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాల గురించి చెప్పండి (కవి సమ్మేళనాలు, రచనలు, హరికథలు, తెలుగు నాటకాలు, తెలుగు పండగలు…)
ఈ మహాసభలలో గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖ సాహిత్యకారులతో పాటు, ఎందరో కవులతో, రచయితలతో మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఎన్నో కార్యక్రమాలు  రూపొందిస్తున్నాము.

8) ఈ కార్యక్రమానికి భారత దేశం నుండీ వస్తున్న ప్రముఖుల గురించి  చెప్పండి. వారితో ఏమైనా ప్రదర్శనలు ఉంటాయా?
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా టీవి / సినీ ప్రముఖులు ఎంతో మంది పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అల్లరి నరేష్, శివాజీ, సుమ, ఝాన్సీ, ఆలి, రవిబాబు, శివ రెడ్డి ఇంకా ఎందరో సినీ ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరందరితో ఎన్నో ఆకర్షణీయమైన కార్యక్రమాలు ప్రదర్శనకు సిద్ధం గా వున్నాయి. మరిన్ని వివరాలు మా వెబ్ సైట్ http://www.tana2015.org/ లో పొందవచ్చు.

 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*