ఫిక్స్‌ చేసుకోండి.. లయన్‌ 8న

Share this News:
lion-movie-release-dateకన్ఫ్యూజన్‌కు తెరపడింది. ఇక అనుమానాలేమీ లేవు. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘లయన్‌’ మే 8న రిలీజ్‌ కాబోతోంది. కొన్ని రోజులుగా లయన్‌ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ నిర్మాత ప్రెస్‌ మీట్‌ పెట్టి రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేశాడు. మే 8న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో లయన్‌ రిలీజ్‌ కాబోతోందని.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడం ఖాయమని రుద్రపాటి రమణరావు చెప్పారు. ఈ ప్రెస్‌ మీట్‌లో నిర్మాతతో పాటు దర్శకుడు సత్యదేవా, ఫైట్‌మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌, ఆలీ, సమీర్‌ కూడా పాల్గొన్నారు.
లెజెండ్‌ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో లయన్‌పై భారీ అంచనాలున్నాయని.. సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని దర్శకుడు తెలిపాడు. బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నట విశ్వరూపం చూపించాడని.. ఈ సినిమా బాలయ్య అభిమానులకు పండగేనని చెప్పాడు. బాలయ్య సీబీఐ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధికా ఆప్టే కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతాన్నందించాడు. సత్యదేవాకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*