రుద్రమదేవి పోస్టర్ కాపీయా… వారి నీ గుణశేఖరా?

Share this News:
rudramadeviఇంటర్నెట్ వచ్చాక కాపీ మాస్టర్లకు కష్టమైపోతోంది…. తెలుగులో భారీ అంచనాలతో తీస్తున్న సినిమాలను కూడా సింపుల్ గా ఏదో ఒక విదేశీ సినిమాకు కాపీ కొట్టేస్తున్నారు. ఎంతోకాలంగా ఇది సాగుతున్నా ఏదో కొద్దిమందికి మాత్రమే ఈ విషయాలు తెలిసేవి. కానీ, ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ గుట్టు బయటపడిపోతోంది. రెండున్నర సంవత్సరాలుగా తీస్తున్న సినిమా బాహుబలి రిలీజ్ చేసిన పోస్టరే కాపీ అని తేలిపోయింది…. తాజాగా ఇంకో బడా మూవీ రుద్రమదేవి కూడా కాపీ కొట్టి దొరికిపోయింది.
గుణశేఖర్ అంటే క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు…  ఆయన నుంచి ఆ రేంజిలోనే ఆశిస్తాం… కానీ, సింపుల్ గా పోస్టర్ ను కాపీ కొట్టి దొరికిపోయారు గుణశేఖర్. ఎన్నో కష్ట నష్టాలకోర్చి సొంత నిర్మాణంలో రుద్రమదేవి సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ లుక్, ఆడియో , ట్రైలర్ విడుదల సమయంలో వీటికి ఎవరూ ఎలాంటి పోలికలు పెట్టలేదు. అయతే… ఇందులో తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ స్టిల్ వెనుక స్టోరీని నెటిజన్లు బయటపెట్టేశారు. ఆ పోస్టర్ ని డ్రాకులా సినిమా పోస్టర్ కు మక్కీకి మక్కీ అని తేల్చేశారు. అల్లు అర్జున్ ఫేస్, పేర్లు తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటున్నారు. ఇంత పెద్ద దర్శకులు, ఇంత పెద్ద సినిమాలే ఇలా కాపీ గొడవలో పడుతుంటే తెలుగు సినిమా రంగంలో సొంత ఆలోచనలే లేవా అనిపిస్తోంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*