700 విజయాలు… 100 మంది పార్టనర్లు

Share this News:
భారత్ గర్వించదగ్గ క్రీడాకారుల్లో టెన్నిస్ దిగ్జజం లియాండర్ పేస్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. నలభైఏళ్ల వయసులోనూ భారత్ కు ప్రతిష్ఠాత్మక పతకాలను సాధించిపెడుతున్నారాయన. ఇప్పుడు ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఎవరికీ దక్కని ఒక గొప్ప రికార్డును సాధించిన పేస్ మరికొద్ది రోజుల్లో ఇంకో అరుదైన రికార్డునూ అందుకోబోతున్నారు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో డేనియల్ నెస్టర్‌తో కలిసి డబుల్స్ ఆడుతున్న లియాండర్ పేస్ 700 మ్యాచ్‌లు గెలిచిన అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. లియాండర్ పేస్ ఇప్పటి వరకూ 55 డబుల్స్ టైటిళ్లు గెలుచుకోగా, అందులో 8 గ్రాండ్ స్లామ్ టైటిళ్లున్నాయి. 40 ఏళ్ల వయసులో 2013లో రాడిక్ స్టెపానిక్‌తో జతకట్టిన పేస్, యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి, టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక వయసులో డబుల్స్ టైటిల్ గెల్చుకున్న రికార్డుని కైవసం చేసుకున్నాడు.
మరోవైపు టెన్నిస్‌లో డబుల్స్‌లో లియాండర్ పేస్ ఇప్పటి వరకూ 99 మంది వేర్వేరు క్రీడాకారులతో డబుల్స్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కొద్ది నెలల్లో ఆయన 100 మంది భాగస్వాములతో ఆడిన ఆటగాడిగా సెంచరీ కొట్టబోతున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ అనంతరం మరోసారి పేస్ తన భాగస్వామిని మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈసారి స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో జతకట్టవచ్చని తెలుస్తోంది. ఇటీవల కాలంలో సింగిల్స్ అంతగా రాణించలేకపోతున్న ఫెదరర్ డబుల్స్‌లో పేస్‌తో జతకట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంపై త్వరలో ఓ ప్రకటన వెలువడనుంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*