నిరాశపడిన అభిమానులకు బాహుభలే కానుక

Share this News:

bahubali

బాహుబలి ఆడియోతో పాటు ట్రైలర్‌ ను ఆదివారం విడుదల చేయాల్సి ఉండగా అది వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో రెండున్నరేళ్లుగా ఊరిస్తున్న ఈ సినిమా సంగతి తెలుసుకునేందుకు ఉవ్విళ్లూరిన అభిమానులు నిరాశపడ్డారు. ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం బాహుబలి మే 31న విడుదల కావలసిన ఈ చిత్రం ట్రైలర్‌, ఆడియో వాయిదా పడడంతో ప్రభాస్‌ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో ప్రభాస్‌, రాజమౌలిలు మీడియా ముందుకొచ్చి అభిమానులకు సారీ చెప్పారు కూడా. ఇప్పుడు వారు మళ్లీ అభిమానులను సంతోషపెట్టడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలికి సంబంధించిన చిన్న టీజర్‌ ను రాజమౌళి శనివారం రాత్రి విడుదల చేయబోతున్నారు.

శనివారం రాత్రి 5 సెకన్ల నిడివి గల బాహుబలి టీజర్‌ ను విడుదల చేస్తున్నారు. జూన్‌ 1న హిందీ ట్రైలర్‌ విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు. రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో ఆడియోపైనా మంచి హోప్స్‌ఉన్నాయి. ఆటంకాలు తొలగి ఆడియో రిలీజ్‌ ఎంత త్వరగా చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*