బాహుబలి ట్రైలర్‌.. ఆన్‌లైన్లో ఐదు గంటలకు

Share this News:
bahubali-teaserసినిమా ఇంటర్వెల్‌లో ట్రైలర్‌ను ప్రదర్శించడం మామూలే. కానీ సినిమా మొదలవడానికి కొంత సమయం ముందు ప్రత్యేకంగా థియేటర్లలో ఓ ట్రైలర్‌ను ప్రదర్శించడం.. దానికి ప్రేక్షకుల్ని ఉచితంగా అనుమతించడం.. ఎక్కడైనా చూశామా? ‘బాహుబలి’ విషయంలో ఈ అరుదైన పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం పదిన్నరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో, పట్టణాల్లో సెలెక్టెడ్‌ థియేటర్లలో ‘బాహుబలి’ ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అన్ని చోట్లా జనాలు బాగానే తరలివచ్చారు. ట్రైలర్‌ను ఆస్వాదించారు. మల్టీప్లెక్స్‌ల్లో మాత్రం అప్పటికే షోలు మొదలవడం వల్ల ఉచితంగా ట్రైలర్‌ను ప్రదర్శించలేకపోయారు. షోల మధ్యలో ఇంటర్వెల్‌లోనే ట్రైలర్‌ వేశారు.
ఐతే అందరూ వెళ్లి థియేటర్లలో ట్రైలర్‌ చూడలేరు కదా.. అందుకే సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో లాంచ్‌ చేస్తామని అంటున్నాడు రాజమౌళి. వెంటనే ఆన్‌లైన్లో కూడా ట్రైలర్‌ వచ్చేస్తే.. ఇక థియేటర్‌ రిలీజ్‌కు అర్థం ఉండదు కాబట్టే ఈ గ్యాప్‌ అన్నమాట. ట్రైలర్‌ రిలీజ్‌కు రెండు గంటల ముందే ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క.. ట్విట్టర్లో అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతారు. నిన్నే ప్రశ్నలు పంపాలని ఆహ్వానించాడు జక్కన్న. ఆ ప్రశ్నల్లోంచి కొన్ని ఎంపిక చేసి.. వీళ్లు నలుగురూ సమాధానాలిస్తారు. కొందరు అభిమానులతో అప్పటికప్పుడు మాట్లాడతారు. ఈ సందడి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. తర్వాత ట్రైలర్‌ రిలీజ్‌. అదీ ప్లాన్‌.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*