ఈ రాతలేంది.. ఆ మాటలేంది జగన్..?

Share this News:

jagan sakshi dailyసూటిగా పాయింట్ లోకి వచ్చేస్తే.. జగన్ తన పత్రికలో రాసే రాతలకు.. మాట్లాడే మాటలకు పోలిక ఉండటం లేదు. ఈ విషయం కాస్త అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ ఒకటి చెబుతాం. జగన్ తన పత్రికలో ఎవరి గురించైనా అనుకూలంగా రాసి.. దానికి భిన్నంగా.. వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉంటుందా?
ఉండనే ఉండదని బలంగా చెబుతారు. కానీ.. జగన్ సొంత పత్రిక సాక్షిలో ఇలాంటి మేజిక్ కనిపిస్తుంది. పాలమూరు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కారు ఏం చేయబోతుందన్న విషయాన్ని వండి వార్చేసి.. పనిలో పనిగా పట్టిసీమ మీద తనకున్న వ్యతిరేకతను..తెలివిగా టీ సర్కారుకు అంటగడుతూ కథనం వండేసింది.
పొద్దున అచ్చేసిన దానికి భిన్నంగా.. సాయంత్రం అయ్యేసరికి ఇదే జగన్ బాబు పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి తీసుకోకుండా శంకుస్థాపన చేశారంటూ కేంద్రమంత్రి ఉమాభారతికి లేఖ రాసేశారు.
ఉన్నట్లుండి నిద్ర నుంచి ఉన్నపళంగా లేచిన చందంగా.. పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసిన ఇన్ని రోజులకు జగన్ కు.. ఆ ప్రాజెక్టుకు అనుమతి తీసుకోలేదన్న విషయం గుర్తుకు రావటం ఏమిటి? ఇంతకాలం పాలమూరు ప్రాజెక్టు మీద పల్లెత్తు మాట తన పత్రికలో అనని జగన్.. ఇప్పుడు ఏకంగా ఫిర్యాదు చేయటం ఏమిటి?
ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు.. జగన్ పత్రిక రాసే రాతలకు.. అదే సమయంలో ఆ పత్రిక యజమాని జగన్ చెప్పే మాటలకు ఏ మాత్రం పొసగని పరిస్థితి. ఉన్నట్లుండి జగన్ కు పాలమూరు అనుమతుల గురించి ఇప్పుడే గుర్తుకొచ్చిందెందుకు?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*