ట్యాపింగ్ చేయకపోతే… రికార్డ్ చేసిన ఆధారాలు చూపండి కేసీఆర్!

Share this News:
గౌరవనీయులైన కేసీఆర్ గారు…
ఓ భారత పౌరుడిగా మాకు కొన్ని సందేహాలున్నాయి. గత మూడు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో  జరుగుతున్న పరిణామాలకు కారణం మీరే. కాబట్టి మీరే మా సందేహాలను నివృత్తి చేయాలి. చేయాలి కాదు మీ బాధ్యత అది. మేం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదు, చంద్రబాబు స్టీఫెన్ సన్తో ఫో్న్లో మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు అంటున్నారు మీరు. మరో వైపు ‘నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం మీకెక్కడిది.. మా ప్రజాప్రతినిధులతో సహా… 120 మంది ఫోన్లను టీఆర్ఏస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని‘ ఏపీ సీఎం  చంద్రబాబు అంటున్నారు. మరి  ఈ రెండు వాదనలూ వింటుంటే… దాన్ని క్లారిఫై చేయాల్సిన మొదటి కర్తవ్యం మీదే. ఎందుకంటే.. నీ సొంత మీడియాలో ఇప్పడు బాబు వాయిస్ అని చెప్పబడుతున్న ఆడియో టెలికాస్ట్ అయింది. ఆ టెలికాస్ట్ అయిన టీవీ ప్రసారాలు మీ పార్టీ ఆఫీసు నుంచే జరుగుతున్నాయి. కాబట్టి మాకు వచ్చిన సందేహాలను తీర్చాల్సిన ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీపై వుంది. చంద్రబాబు నాయుడు… తన వాయిస్ తో సహా 120 మంది వాయిస్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని అంత పెద్ద ఆరోపణ చేస్తుంటే… మీరు దానిపై క్లారిటీని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీ పైనా, మీ ప్రభుత్వంపైనా టీడీపీ ఇన్ని ఆరోపణలు చేస్తోంది. మరో వైపు ఇదే అదనుగా ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అమలుపైనా అనుమానాలను రేకెత్తిస్తోంది టీడీపీ. మరి దాన్ని ఆధారాలతో సహా తిప్పి కొట్టాల్సిన మీరు… ‘బాబు దొరికిన దొంగ… త్వరలోనే జైలుకు వెళతావు‘ అంటూ పదే పదే అరిగిపోయిన రికార్డును వినిపిస్తూ ఎందుకు తప్పుకుంటున్నావు. మీరు ఫోన్లను ట్యాప్ చేయకపోతే… స్టీఫెన్ సన్ ఫోన్ నుంచి రికార్డు చేశాం. ఇదిగో ఈ ఫోన్ నుంచే చేశాం అని చెప్పొచ్చుగా. ఒక వేళ… స్టీఫెన్ సన్ ఫోను ఇప్పడు ఎ.సి.బి. అధికారుల వద్ద వుంటే… దాన్ని సీజ్ చేసి వుంటే… అదైనా మీరు చెప్పాలి. లేదా బాబు వాయిస్ అంటూ… మీరు మీడియాకు ఆడియో టేపులను విడుదల చేసిన రోజైనా… బాబు వాయిస్ ని ఏ ఫోన్ ద్వారా అయితే రికార్డు చేశారో… దాన్ని మీ సొంత మీడియా వీడియోతో రికార్డు చేయించాల్సింది. అలాగే ఫోన్లో రికార్డు అయిన సమయాన్ని, రికార్డయిన వాయిస్ కు ఓ సీరియల్ కోడ్ వుంటుంది. దాన్ని జాగ్రత్తగా వీడియో తీయించి… ప్రసారం చేసివుంటే.. టీడీపీకి ఇప్పడు వాయిస్ వుండేది కాదు. మీరు పదే పదే బాబు ఇప్పడు దొరికిన దొంగ అంటూ… అరిగిన రికార్డను మళ్ళీ మళ్లీ అనాల్సి వచ్చేది కాదు. చూడండి… రోజంతా… బాబుకు నోటీసులు అంటూ.. మీడియా ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందో.. చివరకు ఎసీబీ ఓ ఎమ్మెల్యేకు, మరో టీడీపీ నాయకునికి నోటీసులు ఇచ్చి… మీరు చేస్తున్న వాదనలో పసలేదని నిరూపితమైంది. దాంతో ఇప్పడు బాబు తన వాయిస్ గురించి చెబుతున్నట్టుగా ‘వేరు వేరు సందర్భాల్లో తాను మాట్లాడిన మాటలను ఏరి కూర్చి విడుదల చేశారనే‘ దానిని నమ్మాల్సి వస్తోంది. మరి ఇది అబద్ధం… అది బాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడినదే అని మీరు నిరూపించ లేకపోతున్నారు. అందుకు తగిన ఆధారాలు మీ వద్ద లేవనే సందేహం మాకు కలుగుతోంది. మరో వైపు అ.ని.శా అధికారులు మీడియాకు విడుదలైన ఆడియో టేపులతో గానీ, వీడియో టేపులతో గానీ తమకు సంబంధం లేదని వాదిస్తోంది. మరి మీడియాకు విడుదలైన ఆడియో, వీడియో టేపులు ఎలా రికార్డు చేసిందనేది మీరు చెప్పకపోవడం చూస్తుంటే… అత్యుత్సాహంతో తప్పు చేశారా అనిపిస్తోంది. ట్యాప్ చేయలేదనే దానికి సంబంధించిన బలమైన ఆధారాలేవి టీఆర్ఎస్ వద్ద లేకపోవడంతో టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా… ఫోన్లను కచ్చితంగా ట్యాపింగ్ చేశారనే అందరూ నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ కూడా మీ  వద్ద ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్రం వద్ద ట్యాపింగ్ కు సంబంధించిన బలమైన ఆధారాలను టీడీపీ వుంచిందని… దాంతో సెక్షన్ 8పై టీడీపీ గట్టిగా పట్టుబడుతోందని, ఈ విషయంలో తాను ఏమిచేయలనేని చెప్పడంతోనే… మీరు మీడియా ముందు… విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 8 క్లాజ్.. చెల్లని కాసుగా అసహనంతో అన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకవేళ కేంద్రం మొండిగా ముందుకెళితే ఎలా పోరాడాలో కూడా మాకు తెలుసని మీరన్నారంటే… ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం ఎంత సీరియస్ గా అర్థం అవుతోంది. ఈ విషయాన్ని గవర్నర్ గారు మీకు వివరించే ఉంటాడనేది అర్థమవుతోంది. సో… మీరు బాబు వాయిస్ ఎలా రికార్డు చేసింది చెప్పలేదు… బాబు అది నా వాయిస్ కాదంటారు.  దాంతో ఈ వివాదం ఇలా కొనసాగుతూనే… టీడీపీ సెక్షన్ 8 అమలుపై గట్టిగా పట్టుబడుతుంది. దాంతో ఇప్పడు మీకు ఎటూ పాలు పోని పరిస్థితి. అనవసరంగా రచ్చ చేశామా అనే ఆందోళనతో మీరు, మీ పార్టీ వున్నట్లు స్పష్టమవుతోంది. ఎవరు తీసిన గోతిలో వారే పడటం అంటే ఇదే నేమో… అనిపిస్తోంది. పెద్దలు ఊరకే అనలేదు… చెడపకురా చెడేవు అని.. ఈ పాటికి మీకు బాగానే అర్థమయ్యే వుంటుంది అనుకుంటాం!!
                                                                                               ఇట్లు
కె.నాని బాబు
                                                                           హైదరాబాద్ లో నివసిస్తున్న భారతీయుడు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*