బాహుబలి బెనిఫిట్ షో టిక్కెట్ 5 వేలు

Share this News:

bahubali latest picఅగ్ర హీరోల సినిమాలు విడుదలకు ముందే బెనిఫిట్ షో అనే పేరుతో తెర మీదికి రావడం అందరికీ తెలిసిన విషయమే. చారిటీ పేరు చెబితేనే వీటికి పోలీసులు నుండి అనుమతి లభించేది. కొంతమంది వీరాభిమానులు తమ హీరో సినిమాని అందరికంటే ముందుగ చూడాలని 70 రూపాయల టికెట్ ని 500లు ఆపైన ధరలు కొని తమ ముచ్చట తీర్చుకుంటూంటారు.

బాహుబలి సినిమాని బెనిఫిట్ షో వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టిక్కెట్ ధర మాత్రం ఓ షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ కి సరిపోయేలా అయిదువేలని నిర్ణయిస్తున్నారట.
బెనిఫిట్ షో కూడా రెగ్యులర్ గా ఒకటి రెండు థియేటర్లలో కాకుండా దాదాపు 20 థియేటర్లలో వేయాలని సన్నాహాలు జరుగుతున్నయట. బాహుబలి మీద అంచనాలు భారీగా ఉండడంతో ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అయినా ఎంత గొప్ప సినిమా అయితే మాత్రం 5 వేలు టిక్కెటు పెట్టడం మాత్రం టూమచ్ అంటున్నారు సగటు ప్రేక్షకులు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*