రోబో-2లో రజినీ ఒక్కడే

Share this News:

robo

రోబో-2 విషయంలో సస్పెన్స్ కు ఇప్పటికే తెరపడింది. శంకర్ కానీ, రజినీకాంత్ కానీ.. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటిదాకా నోరు విప్పలేదు కానీ.. ఈ సినిమాకు పని చేస్తున్న రచయిత జయమోహన్ ఇప్పటికే రోబో-2కు పని చేస్తున్నట్లు మీడియాతో కన్ఫమ్ చేశారు. ఐతే ఈ కన్ఫర్మేషన్ వచ్చాక ప్రాజెక్టుకు సంబంధించి ఇతర విశేషాల గురించి చర్చ మొదలైంది. విలన్ గా విక్రమ్ చేస్తాడని.. హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను, దీపికా పదుకొనేను అనుకుంటున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఐతే జయమోహన్ తాజాగా మరోసారి మాట్లాడుతూ.. ఇవన్నీ రూమర్లే అని కొట్టి పారేశారు.

రోబో-2కు శంకర్ దర్వకత్వం వహించడం, రజినీకాంత్ హీరోగా నటించడం మాత్రమే నిజమని.. మిగతా ఏ విషయం కన్ఫమ్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తవడానికి ఇంకొంత సమయం పడుతుందన్న జయమోహన్.. ఈ ఏడాది ఆఖర్లో ‘రోబో-2’ మొదలయ్యే అవకాశాలున్నట్లు చెప్పారు. బడ్జెట్ గురించి.. నిర్మాత ఎవరన్నది శంకర్ త్వరలోనే వెల్లడిస్తారని.. స్క్రిప్టు మొత్తం పూర్తయ్యాకే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక  జరుగుతుందని చెప్పారు. రోబో-2 పక్కా సీక్వెల్ లక్షణాలున్న సినిమా అని.. రోబో ఎక్కడ ఆగిందో అక్కడే సినిమా మొదలవుతుందని జయమోహన్ వెల్లడించారు. 2010లో వచ్చిన రోబో ఎంత  పెద్ద సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లోనే దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసిందా సినిమా. ఈసారి దానికి రెట్టింపు వసూళ్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నాడు శంకర్.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*