దేశం కోసం ఆ రెండూ చేస్తాన‌న్న మోడీ

Share this News:

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మ‌రోమారు త‌న ఆక‌ట్టుకునే ప్ర‌సంగంతో ఆహుతుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేశారు. కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్ లో తొలుత కాస్తంత సాధారణ వ్యాఖ్యలతోనే ప్రారంభమైన ఆయన ప్రసంగం క్రమంగా ఉద్వేగభరితంగా మారింది.   ‘ఈ దేహం దేశం కోసమే. భార‌త‌దేశం కోసం జీవిస్తా. దేశం కోసం మరణిస్తా’’ అని మోడీ ఈ సందర్భంగా ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. అంతకుముందు స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ పేరును ప్రస్తావించిన ఆయన భగత్ సింగ్ జన్మదినం నేడేనని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్‌ జన్మదినం నాడు ప్రవాస భారతీయులను కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. భరతమాత ముద్దుబిడ్డకు శతకోటి వందనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదరికం లాంటి అనేక సమస్యలున్నా… దేశం ప్రగతి బాటలో దూసుకెళుతోందని ఆయన అన్నారు.

ప్రధానిగా తనకు ఇది రెండోసారి అమెరికా పర్యటన అని మోడీ తెలిపారు. గతేడాది పర్యటనలో మాడిసన్‌ స్వ్కేర్‌లో భారతీయులను కలిశానని.. ఏడాది తర్వాత కాలిఫోర్నియాలో ప్రవాసులను కలిశానని అన్నారు. 21వ శ‌తాబ్దం భార‌త దేశానిదే అన్న మోడీ.. కంప్యూట‌ర్ కీబోర్డుపై మీరు చేసే మేజిక్ తో భార‌త్ కు కొత్త గుర్తింపు వ‌స్తుంద‌ని ఎన్నారైల‌ను కొనియాడారు. ఉపనిషత్తుల స్థాయి నుంచి ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి భార‌తీయులు చేరుకున్నార‌ని…ఇది గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. ఉపగ్రహాల ప్రయోగాల కోసం డబ్బును వృథా చేస్తున్నారని గతంలో విమర్శలు వస్తే, ప్రస్తుతం అవే ఉపగ్రహాల ప్రయోగంతో భారీ సంపాదన రాబట్టే స్థాయికి చేరుకున్నామన్నారు. మామ్ లాంటి భారీ ఉపగ్రహాల ప్రయోగంలో తొలి యత్నంలోనే భారీ విజయాన్ని నమోదు చేశామన్నారు. 800 మిలియన్ల జనాభా ఉన్న భారతీయులు తలచుకుంటే ఏమైనా చేయగలరని కూడా మోడీ వ్యాఖ్యానించారు.

వెంక‌య్య‌కు స‌వాల్‌….డైరెక్ట్ ఎల‌క్ష‌న్ల‌లో గెలుస్తావా..!
కొత్త పెళ్లి కూతురు మొగుడ్నే దోచేసింది

Share this News:

Leave a comment

Your email address will not be published.

*