చిరు 151వ సినిమా నిర్మాత ఫిక్స‌య్యాడు

Share this News:
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం ఆయ‌న అభిమానుల‌తో పాటు టాలీవుడ్ సినిమా అభిమానులంద‌రూ దాదాపు ఆరేడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2007లో వ‌చ్చిన శంక‌ర్‌దాదా జిందాబాద్ సినిమా త‌ర్వాత చిరు న‌టించిన ఫుల్ మూవీ రాలేదు. త‌ర్వాత చిరు రాజ‌కీయాల్లో బిజీ అయ్యారు. 2009లో వ‌చ్చిన మ‌గ‌ధీర మూవీలో చిరు చిన్న‌పాట‌లో త‌ళుక్కున మెరిశారు. అయితే చిరు 150వ సినిమా గురించి సంవ‌త్స‌రంన్న‌ర కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయినా ఈ మూవీ ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు.
 చిరు 150వ సినిమా లేట్ అయ్యే ఛాన్సులు ఉండ‌డంతో చెర్రీ లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ – ది ఫైట‌ర్‌లో మూడు నిమిషాల పాటు తెర‌మీద క‌నిపించి ఫ్యాన్స్‌కు పెద్ద స‌ర్ ఫ్రైజ్ ఇచ్చేందుకు రెఢీ అవుతున్నారు. తాజాగా శుక్ర‌వారం బ్రూస్ లీ ఆడియో ఫంక్ష‌న్లో యాంక‌ర్ సుమ చిరుతో రూ.200 కోట్లు పెట్టి సినిమా చేస్తారా అని చిరు బావ‌, అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్‌ను ప్ర‌శ్నించింది. అయితే ఇందుకు అర‌వింద్ స్పందిస్తూ తాను చిరంజీవి కాల్షీట్లు ఇస్తే రేపే షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటాన‌ని చెప్పారు. చిరంజీవితో రూ.200 కోట్లు కాదు రూ.300 కోట్ల‌తో అయినా సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని చిరుపై త‌న‌కు ఉన్న అభిమానాన్ని మారోసారి చాటుకున్నారు.
        అలాగే చిరు 151వ సినిమా త‌న బ్యాన‌ర్‌లోనే చేస్తున్నాడ‌ని…ఈ విష‌యంపై ఆయ‌న త‌న‌కు గ‌తంలోనే హామీ ఇచ్చార‌ని…అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని అర‌వింద్ చెప్పారు. సో ఓవ‌రాల్‌గా చిరు 150వ సినిమా ఎవ‌రి బ్యాన‌ర్‌లో చేసినా 151 సినిమా మాత్రం గీతా ఆర్ట్స్‌కు ఫిక్స‌యిపోయిన‌ట్టే. అలాగే చెర్రీకి చిరు గ‌ట్టి కాంపిటేట‌ర్ అని…చెర్రీ ఇండ‌స్ర్టీలో త‌న తండ్రితోనే పోటీ ప‌డి ఎదుర్కొని స‌మాధానం చెప్పాల‌ని చ‌మ‌త్క‌రించారు
కోన వెంక‌ట్ షాకింగ్‌: ఐ హేట్ శ్రీను వైట్ల‌
అప్ప‌టివ‌ర‌కు నిద్ర‌పోన‌న్న బాబు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*