కొత్త ట్రైలర్: రక్తపుటేరుల అటాక్

Share this News:

సందేహమే లేదు. రామ్ గోపాల్ వర్మ ‘అటాక్’ మూవీలో ‘రక్తచరిత్ర’ను మించిన వయొలెన్స్ చూడబోతున్నాం. ఆ మధ్య వచ్చిన తొలి ట్రైలర్లోనే ఈ విషయం అర్థమైంది కానీ.. ఇప్పుడు కొత్త ట్రైలర్లో మరింతగా రక్తం చిందించి.. కత్తులు, తుపాకుల్ని తెగ వాడి.. వయొలెన్స్ విషయంలో ‘రక్తచరిత్ర’కు ఏమాత్రం తక్కువ కాని సినిమా తీస్తున్నానని చాటుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఐతే తన సినిమా ఇలా ఉండబోతోందని ముందే హింట్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎవరికీ ఆ విషయంలో అభ్యంతరాలు పెట్టుకోవాల్సిన పని లేదు.
ఓ పెళ్లి చుట్టూ తిరిగే వయొలెంట్ స్టోరీ ఇదని రెండో ట్రైలర్ని బట్టి అర్థమవుతోంది. మాంగల్యం తంతునా.. అనే పెళ్లి మంత్రంతో ట్రైలర్ ను ఆరంభించాడు వర్మ. ఆ తర్వాత ‘‘రక్తపు చుక్కలే అక్షింతలై జరుగుతున్న పెళ్లి.. చావు కేకలే మంత్రాలై జరుగుతున్న పెళ్లి’’ అనే లిరిక్స్ తో పాట సాగిపోతుంటే అటాక్ ల మీద అటాక్ లు జరిగిపోతున్నాయి. మూసీ నది మీదుగా పాత బస్తీ ఏరియాను తనదైన స్టయిల్లో చూపించాడు వర్మ. ప్రకాష్ రాజ్, మంచు మనోజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ వర్మ స్టయిలుకి తగ్గ లుక్స్ తో ఇంటెన్సిటీ చూపించారు. ట్రైలర్ అంతా రక్తపాతమే. వచ్చే నెలలోనే సినిమా విడుదలవుతోంది. ‘రక్తచరిత్ర’ నచ్చిన ప్రేక్షకులంతా థియేటర్లకు పరుగులు పెట్టేయొచ్చు.

ఘోర రోడ్డు ప్ర‌మాదం…15 మంది మృతి
నేనా..  ట్యాక్స్ ఎగ్గొట్టడమా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*