సల్మాన్ ఖాన్ కి రామ్ చరణ్ డబ్బింగ్

Share this News:

హెడ్డింగ్ పిచ్చెక్కించేస్తోంది కదా. ఏం అంతుబట్టట్లేదు కదా. సల్మాన్ ఖాన్ కి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడమేంటో అర్థం కావడం లేదు కదా. కానీ అదే జరగబోతోంది. సల్మాన్ ఖాన్ కు రామ్ చరణ్ గొంతు అరువివ్వబోతున్నాడు మెగా పవర్ స్టార్. సల్మాన్ కొత్త సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ కోసం గొంతు సవరించుకోబోతున్నాడు చరణ్. ఈ సినిమా ఈ దీపావళికే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

సల్మాన్ ఖాన్-సూరజ్ బర్జాత్యా కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఇంతకుముందు వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన మైనే ప్యార్ కియా (ప్రేమ పావురాలు), హమ్ ఆప్ హై కౌన్ (ప్రేమాలయం) సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ను కూడా తెలుగులోకి అనువదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూవీని తెలుగులోకి కూడా అనువదించి భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఐతే సల్మాన్ కు మంచి మిత్రుడైన రామ్ చరణ్ ను ఇందులో హీరో పాత్రకు డబ్బింగ్ చెబితే బావుంటుందని భావించి ఆ సంగతే సల్మాన్ తో చెప్పించారట. చరణ్ మరో మాట లేకుండా ఒప్పేసుకున్నాడట. కాబట్టి సల్మాన్ సినిమాను చరణ్ వాయిస్ తో చూడబోతున్నామన్నమాట. ఈ సినిమాలో సోనమ్ కపూర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ట్రయలరే.. అమరావతి రికార్డులు బద్దలుగొడుతుంది
దొంగ నాయకులను పట్టించే కెమేరా

Share this News:

Leave a comment

Your email address will not be published.

*