రుద్రమదేవి.. రూ.81.77 కోట్లు

Share this News:
​ ​

‘రుద్రమదేవి’ విడుదలవుతుంటే ఎన్నెన్ని అనుమానాలో. పాపం.. గుణశేఖర్ ఏమైపోతాడో అని జనాలకు ఎంత టెన్షనో. తొలి రోజు సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ ఆ అనుమానాల్ని, భయాల్ని మరింత పెంచింది. కానీ సినిమా మాత్రం అంచనాల్ని మించి వసూళ్లు సాధించి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరుస్తోంది. మూడో వీకెండ్ కూడా ముగిసేసరికి ఈ సినిమా రూ.81.77 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఐతే ఇంత మొత్తంలో షేర్ సాధిస్తేనే గుణశేఖర్ సేఫ్ అయినట్లు. కానీ షేర్ రూ.48.42 కోట్లు వచ్చింది. ఇది తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలన్నీ కలిపి ప్రపంచ వ్యాప్తంగా ‘రుద్రమదేవి’ సాధించిన షేర్.

నైజాం ఏరియాలో ఈ సినిమా రూ.20.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. పన్ను మినహాయింపు వల్ల షేర్ కూడా బాగానే వచ్చింది. రూ.14.24 కోట్లు నేరుగా డిస్ట్రిబ్యూటర్ ఖాతాలోకి వెళ్లాయి. దిల్ రాజు ఈ సినిమాను రూ.12 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే. ఏపీ, నైజాం కలిపి ‘రుద్రమదేవి’ రూ.47 కోట్ల గ్రాస్.. రూ.32.87 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. యుఎస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపితే తెలుగు వెర్షన్ రూ.63.12 కోట్ల గ్రాస్, రూ.41.47 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. హిందీ వెర్షన్ రూ.5.1 కోట్ల గ్రాస్, రూ.1.15 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. వారం లేటుగా రిలీజైనప్పటికీ తమిళ వెర్షన్ బాగానే సత్తా చాటింది. అక్కడ రూ.7.9 కోట్ల గ్రాస్, రూ.3.35 కోట్ల షేర్ వసూలైంది. మలయాళ వెర్షన్ రూ.4.25 కోట్ల గ్రాస్, రూ.1.75 కోట్ల షేర్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటరుకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. రుద్రమదేవి షేర్ రూ.50 కోట్ల మార్కును అందుకోవడం లాంఛనమే. శాటిలైట్ కూడా కలుపుకుంటే రుద్రమదేవి రూ.60 కోట్లు సంపాదించినట్లు లెక్క.
చోటా రాజ‌న్‌ను ప‌ట్టించింది ఈయ‌నా?
ఇక మొబైళ్లన్నీ మేడిన్ ఆంధ్రాయే

Share this News:

Leave a comment

Your email address will not be published.

*