పవన్.. చరణ్ కోరిక తీర్చేస్తున్నాడా?

Share this News:
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరక్టర్‌తో పని చేయాలని టాలీవుడ్లోని ప్రతి హీరో కోరుకుంటాడనడంలో సందేహం లేదు. కానీ త్రివిక్రమ్ మాత్రం హీరోల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటాడు. ఒకసారి చేసిన వాళ్లతోనే మళ్లీ సినిమాలు చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్.. వీళ్లతో తలో రెండు సినిమాలు చేశాడు. డైరెక్టర్‌గా స్టార్ స్టేటస్ సంపాదించాక తొలిసారి నితిన్ లాంటి మీడియం రేంజి హీరోతో సినిమా తీస్తున్నాడు త్రివిక్రమ్. ఐతే త్రివిక్రమ్‌తో పని చేయాలని మరో మెగా హీరో రామ్ చరణ్‌కు ఎప్పట్నుంచో కోరిక ఉన్నట్లు చెబుతారు. నితిన్‌కు దక్కిన అదృష్టం తనకు దక్కలేదని చరణ్ కొంచెం ఫీలైనట్లు కూడా సమాచారం.
ఐతే చరణ్ కోరిక తీర్చడానికి బాబాయి పవన్ కళ్యాణే నడుం బిగించినట్లు సమాచారం. పవన్‌కు త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా పవన్ ఓ సినిమాను నిర్మిస్తానని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. డైరెక్టర్ మరెవరో కాదు.. త్రివిక్రమే. ఇందుకు పవనే ఒప్పించినట్లు సమాచారం. వాస్తవానికి నితిన్‌తో ‘అ.. ఆ’ పూర్తి చేశాక త్రివిక్రమ్ పవన్‌తోనే ఓ సినిమా చేయాల్సి ఉంది.  కానీ పవన్‌కున్న కమిట్మెంట్ల ప్రకారం ఇంకో ఏడాదిన్నర దాకా ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ముందు చరణ్‌తో సినిమా చేసిపెట్టాలని పవన్ అడగ్గా.. త్రివిక్రమ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా మొదలుపెట్టి దసరాకు విడుదల చేస్తారట.
రాయ‌ల‌సీమ ర‌చ్చ‌కు బాబు చెక్
అమ‌రావ‌తికి 20 కోట్లు…వ‌రంగ‌ల్ 72 కోట్లు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*