హ్యాట్సాఫ్ టు రైల్వే: అంధులకు రైల్వేస్టేషన్

Share this News:

ప్రపంచంలోని అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వే ఒక మంచి నిర్ణయం తీసుకుని రికార్డులకెక్కింది. ఇండియాలోనే మొట్టమొదటి అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌ గా మైసూరు స్టేషన్ ను తీర్చిదిద్దింది.  అంధుల లిపి అయిన బ్రెయిలీలో రైళ్ల రాకపోకల షెడ్యూల్‌ను తయారు చేసి ఈ స్టేషన్‌లో పెట్టారు.

అనుప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది.  నెలన్నర క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ మొదటి విడతలో భాగంగా మైసూర్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ బోర్డులో రైళ్ల రాకపోకల వివరాలతో పాటు.. రైల్వే స్టేషన్‌లోని ఎంట్రీలు, ఎగ్జిట్‌లు, ప్లాట్‌ఫాంలు, కౌంటర్లు, మరుగుదొడ్లు ఎటువైపు ఉన్నాయో సూచిస్తాయి. ప్రతి ప్లాట్‌ఫాంపైన 400 మెటాలిక్ బ్రెయిలీ గుర్తులు బిగించారు. అయితే రైల్వే స్టేషన్‌లో ఉండే రెస్టారెంట్లు, క్యాంటీన్‌ల్లో మెనూ కార్డులు మాత్రం ఇవి ఉండవు. అనుప్రయాస్ సంస్థను 27 ఏళ్ల పంచం నడిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పంచం తన ఐదుగురు స్నేహితులతో కలిసి మొదలుపెట్టాడు. కర్ణాటకలోని ఇతర స్టేషన్లనూ అంధులకు అనుకూలంగా మార్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆంధ్ర+సింగపూర్+జపాన్+చైనా=అమరావతి
అమరావతి హంపి నగరంలా శోభిల్లాలి: ఎన్నారైలు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*