వినాయ‌క్ ని కూడా ప‌క్క‌కు పెట్టిన చిరు!

Share this News:

మెగాస్టార్ ఏ ముహూర్తాన 150వ సినిమా చేయాల‌నుకున్నాడో కానీ అడుగడుగునా అడ్డంకులే ఎదుర‌వుతున్నాయి. ద‌ర్శ‌కుడుగా పూరి జ‌గ‌న్నాథ్  దాదాపుగా ఖ‌రారయ్యాడ‌నుకుంటున్న  స‌మ‌యంలో పూరితో చేయ‌ట్లేదంటూ అంద‌రికీ షాకిచ్చారు చిరు. ఠాగూర్‌తో మంచి హిట్టిచ్చిన‌వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో  త‌న 150వ సినిమా చేస్తే బావుంటుంద‌ని భావించాడు చిరు. అప్ప‌టికి వినాయ‌క్ అఖిల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కానీ మ‌ధ్య మ‌ధ్య‌లో చిరుతో సిట్టింగ్స్ కూడా జ‌రిగాయి. అంద‌రూ ద‌ర్శ‌కుడుగా   వినాయ‌క్  ఫైన‌ల్…కానీ క‌థే సెట్ అవ్వాల్సి ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు వినాయ‌క్  ని కూడా చిరంజీవి ప‌క్క‌కు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌సారి ఆ వివ‌రాల్లోకి వెళితే…

మొదటి నుండి కూడా చిరు ‘అఖిల్ ‘ చిత్ర టాక్ బట్టి వినాయక్ తో 150వ చిత్రం చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట..ఇప్పుడు అఖిల్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాక స్క్రీన్ ప్లే , దర్శకత్వం కూడా బాగా చేయలేదని విమర్శలు రావడం తో చిరు వినాయక్ ని పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు చిరు 150 వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో అనే అయోమయం లో ఫాన్స్ ఉన్నారు..మరి ఆ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి మరి…ఇది నిజంగా మెగా ఫాన్స్ కు  షాకింగ్ న్యూస్ అన‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా ఫ్లాప్ అయినా వినాయక్ కి మాత్రం మంచి మార్కులు ప‌డేవి. అఖిల్  మాత్రం వినాయక్‌కు  ఉన్న మంచి పేరు కిల్ చేశాడు.

సైజ్ జీరో లో బ‌డా హీరో హీరోయిన్లు!
డిక్టేట‌ర్ అక్క‌డే డిసైడ్ అయ్యాడు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*