వేద‌ళం వైపు చిరు చూపు!

Share this News:

చిరంజీవి 150వ సినిమా ఎలా ఉండ‌బోతుందో ఏమో కానీ, దాని కోసం క‌థ‌లు, ద‌ర్శ‌కులు మాత్రం రోజుకొక‌రు తెర మీద‌కొస్తున్నారు. ఇంకా క‌థ‌ల వేట కొన‌సాగుతూనే  ఉంది. క‌థ ఎప్పుడు కుద‌రాలి? ద‌ర్శ‌కుడెప్పుడు ఖ‌రార‌వ్వాలి?  సినిమా ఎప్పుడు మొద‌ల‌వ్వాలి? అస‌లు క‌థేంటి? ద‌ర్శ‌కుడెవ‌రు? ఇలాంటి  ఆలోచ‌న‌ల‌తో బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు మెగా అభిమానులు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే హైద‌రాబాద్‌లో మెట్రో రైలు కోసం ఎంత‌గా జ‌నాలు ఎద‌రు చూస్తున్నారో,  సినీ మెగా ఫ్యాన్స్‌, సినీ ప్రేమికులు చిరంజీవి సినిమా కోసం అంత‌లా ఎద‌రు చూస్తున్నార‌ని  చెప్ప‌వ‌చ్చు. మొన్న ఆ మ‌ధ్య విజ‌య్ న‌టించిన త‌మిళ చిత్రం క‌త్తి ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడంటూ వార్త‌లొచ్చాయి. చివ‌రికి అది కూడా ఖ‌రారు కాలేదు. నిన్న‌టికి నిన్న 49-ఒ అనే మ‌రో త‌మిళ చిత్రాన్ని చేయ‌నున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడ‌దీ లేదంటున్నారు. తాజాగా మ‌రో రీమేక్ పై చిరంజీవి క‌న్ను ప‌డిందంటున్నారు. ఒక‌సారి ఆ వివ‌రాల్లోకి వెళ‌దాం..

 దీపావ‌ళి రోజున  అజిత్ నటించిన ‘వేదళం’ చిత్రం విడుద‌లై మంచి పేరు తెచ్చ‌కుంది. అయితే ఇటీవ‌ల చిరు వేద‌ళం చిత్రాన్ని చూశార‌ట‌,  స్టొరీ బాగా నచ్చడం తో వేద‌ళం చిత్రాన్ని తెలుగులో  రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని తన సన్నిహితులను అడుగుతునట్లు సమాచారం వ‌స్తోంది.

వేదళం చిత్రం మాస్ ఎంటర్ టైనర్ గా, సిస్టర్ సెంటిమెంట్ తో దర్శకుడు శివ అద్భ‌తంగా తెరకెక్కించాడు..సినిమా బాగుందనే టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగా రావ‌డంతో  చిరు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్లు తెలుస్తోంది. చూద్దాం చివ‌రికి ఏ రీమేక్ చేస్తాడో!

జలపాతంలా కురుస్తున్న తిరుమల వెంకన్న నామం
మేయ‌ర్ మ‌ర్డ‌ర్‌పై చంద్ర‌బాబు డెడ్‌లైన్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*