కేసీఆర్ నిర్ణ‌యంతో ఏపీలో స‌మ‌స్య‌లు

Share this News:

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణ‌యం ఇపుడు ఏపీలో చిక్కులు ఎదుర‌వుతున్నాయి. త‌న ఆశ్రిత ప‌క్ష‌పాతం కోణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు కీల‌క‌మైన ముందడుగు విష‌యంలో తేల్చుకోలేకపోతున్నారు. ఏపీ డీజీపీ ఎంపిక విష‌యంలో ఈ స‌మ‌స్య ఎదురవుతోంది.

రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత ఏపీ, తెలంగాణ‌ల్లో తాత్కాలిక డీజీపీల‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే తెలంగాణ తాత్కాలిక డీజీపీగా ఉన్న అనురాగ్ శ‌ర్మ‌ను కేసీఆర్ పూర్తిస్థాయి డీజీపీగా ఖ‌రారుచేశారు. ఇపుడు ఏపీలోనూ అదే ప్ర‌తిపాద‌న వ‌స్తుంది. జేవీ రాముడు రిటైర్మెంట్‌కు అతి సమీపంలో ఉన్న స‌మ‌యంలోనే చంద్రబాబు సర్కారు విభజనాంతర ఏపీకి తొలి డీజీపీగా గతేడాది నియమించింది. డీజీపీగా నియమితులైన అధికారి వాస్తవ రిటైర్మెంట్‌తో సంబంధం లేకుండా నియమించిన తేదీ నుంచి రెండేళ్లు ఆ స్థానంలో కొనసాగాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ వెసులుబాటుతో రాముడు 2016 జులై వరకు డీజీపీగా కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత కూడా మరో ఏడాది రాముడిని డీజీపీగా కొనసాగించేందుకు ప్ర‌భుత్వం సుముఖంగా ఉన్న‌ట్లు సమాచారం. ముఖ్యమంత్రికి ఉన్న విశేషాధికారాలతో రాముడి పదవి కాలాన్ని ఇంకో ఏడాది పొడగించనున్నట్లు పోలీస్‌ వర్గాలు చెప్తున్నాయి.

పదవీకాలం పొడిగిస్తే 2017 జులై వరకు రాముడే ఏపీ డీజీపీగా కొనసాగుతారు.  అయితే ఆయన నియామక సమయంలోనే సీనియర్‌ అధికారుల్లో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాముడు 1981 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు కాగా ఆయన కంటే ముందు 1979 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అశోక్‌ ప్రసాద్‌, ఎస్‌ఎ హుడా ఇంకా సర్వీసులో ఉన్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న అశోక్‌ ప్రసాద్‌ వచ్చే సంవత్సరం జనవరిలో రిటైరవుతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. రాష్ట్రంలో పని చేస్తున్న హుడాకు 2017 జులై వరకు సర్వీసు ఉంది. సీనియర్‌ అయిన తనను పక్కనబెట్టి జూనియర్‌ అయిన రాముడిని డీజీపీగా నియమించడంపై ఇప్పటికే కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌)లో హుడా కేసు వేశారు.

అయితే తెలంగాణ‌లో పాటించిన సంప్ర‌దాయాన్నే ఏపీలోనూ పాటించాల‌ని ప‌లువురు ఉన్న‌తాధికారులు ఆశిస్తున్నారు. కానీ జేవీ రాముడికి ప్రభుత్వం మరో ఏడాది పదవీకాలం పొడిగిస్తే హుడా న్యాయపరంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఐపీఎస్‌ వర్గాలంటున్నాయి. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో సంక‌టంలో ప‌డ్డ‌ చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి మ‌రి.

జ‌గ‌న్‌కు ఏం షాకిచ్చావు బాబు!
లోకేశ్, సుజనా టగ్ ఆఫ్ వార్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*