చైతుతో  శ్రుతి కుదిరింది!

Share this News:

‘కార్తికేయ’  చిత్రంతో దర్శకుడుగా ప‌రిచ‌య‌మయ్యారు  చందు మొండేటి. మల‌యాళ సీమలో పెద్ద విజయం సాధించిన  ప్రేమం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా శ్రుతిహాస‌న్‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. ఈ  చిత్రాన్ని  యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన ఈ రోజు విడుదలైంది. ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెలలోనే చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ విశాఖలో ప్రారంభమవుతుంది. సమ్మర్ స్పెషల్ గా చిత్రం విడుదల చేయ‌నున్నారు. ‘ప్రేమం’ ఓ స్వచ్చ మైన ప్రేమకధ. ‘ప్రేమ తో కూడిన సంగీత భరిత వినోద దృశ్య కావ్యం ఈ చిత్రం.అక్కినేని నాగచైతన్య సరసన  శ్రుతిహాసన్ తో పాటు మరో ఇద్దరు కధానాయికలు కూడా నటిస్తున్నారు. వారిలో ఒకరు ‘అనుపమ పరమేశ్వరన్’ కాగా మరో కధానాయిక ఎంపిక కావలసి ఉంది.

ఈ చిత్రానికి సంగీతం; రాజేష్ మురుగేషన్, గోపిసుందర్; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ని, నిర్మాత:  సూర్యదేవర నాగవంశి, స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి

వ‌రంగ‌ల్‌లో వైకాపా..తెరాస మిలాఖ‌త్ సీక్రెట్‌
చిన్నారిని హత్య చేసిన బడి

Share this News:

Leave a comment

Your email address will not be published.

*