మోత్కుపల్లి నిరాహార దీక్ష

Share this News:

మోత్కుపల్లి టీడీపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరు. కేసీఆర్ ను ఎదుర్కొనే టీడీపీ ఆయుధాల్లో ఆయనొకరు. ఈరోజు ఆయన ఒక పార్టీకి కాకుండా తన జిల్లాకు సంబంధించిన ఒక విషయంతో వార్తలకెక్కారు. ‘తెలంగాణ తిరుమల’గా ఈ మధ్యన ప్రాచుర్యం పొందుతున్న యాదాద్రి పట్టణ కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. అంతకుమునుపు ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ యాదాద్రి దేవాలయ వైకుంఠ ద్వారం నుంచి పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీసు వరకు జరిగింది. అనంతరం ఆయన అక్కడే నిరాహార దీక్షకు పూనుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన పలువురు స్వాతంత్ర్య సమర యోధులకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాదాద్రి జిల్లాను డిమాండ్ చేస్తూ నినాదాలతో నిరాహార దీక్షకు కూర్చున్నారు.

టీఆర్ఎస్‌లో కొత్త‌ కుంప‌టి
ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య మ‌ళ్లీ లొల్లి

Share this News:

Leave a comment

Your email address will not be published.

*