ఆయన మాట‌కు కేసీఆర్ ఓటేస్తారా..!

Share this News:

నిన్న‌మొన్న‌టిదాకా వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక పోరుతో అల‌సిసొల‌సి ఉన్న గులాబీ దండు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించ‌గానే స్థానిక పోరుపై దృష్టి సారించింది. ముఖ్యంగా పాల‌మూరు జిల్లాలో స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస‌లో ఎవ‌రికి అవ‌కాశం వ‌రిస్తుంది అన్న‌ది ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ రెండింటిలో ఒక‌టి ఓసీల‌కే ఖ‌రారు కాగా మ‌రొక‌టి ఎవ‌రికి ద‌క్క‌నుంద‌న్న‌ది ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వాస్త‌వానికి స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీ గా ఎన్నికైనా జగదీశ్వర్ రెడ్డి పదవీకాలం గత ఏప్రిల్ నెలాఖరులో ముగిసింది.దీంతో  ఈ స్థానంలో స‌హా కొత్తగా మరో స్థానానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది.

ఓసీ వర్గానికి సంబంధించి ఒక పారిశ్రామిక వేత్త.. మరో విద్యాసంస్ధల అధినేత పోటీపడుతుండడం గ‌మనార్హం. దీంతో బీసీ వర్గాలు అప్రమత్తమయ్యా యి. ఇందులో భాగంగా కొంద‌రు ఆశాహ‌హులు సీఎం కేసీఆర్ ను కలుసుకుని తమకో ఛాన్స్ ఇవ్వాల‌ని కోరారు. ఇందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించార‌ని టాక్‌. పాల‌మూరులో ఖాళీ అయిన రెండు స్థానాల్లో  ఒక స్ధానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి పోటీచేయడం ఖరారైంది. దీంతో రెండో టిక్కెట్ కోసం ప్రముఖ విద్యాసంస్ధల ఛైర్మన్ తోపాటు, టీఆర్ఎస్ పార్టీ  జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్ రావు ఆర్యా కూడా ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశిస్తుండడం విశేషం. అంతేకాక బీసీ కోటా నుంచి ఐదుగురు పోటీ పడుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరో వైపు మాజీ ఎంపీ మందా జగన్నాథం తమ సామాజిక వర్గానికి రెండో టిక్కెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. ఆయ‌న‌తో పాటు గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌రఫున‌ వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల‌కు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, పార్టీ కోసం మొద‌టి నుంచి ప‌నిచేస్తున్న నేత‌లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్ల కోసం విశ్వ ప్ర‌యత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి రెండో ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది.

 

తెరాస ​: ఈ దూకుడు ఎంత దాకా?
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరేనా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*