రోబో-2.. ఆమె కన్ఫమ్, అతను డౌట్

Share this News:

రోబో-2.. ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే సంచలనం రేపుతున్న సినిమా. షూటింగ్ మొదలవకముందే కేవలం కాంబినేషన్ క్రేజ్‌తోనే జనాల్ని ఆకర్షించడం శంకర్‌కు అలవాటే. ఈ సినిమాను హీరోను ఫిక్స్ చేయడానికే చాలా ఆలోచించాడు శంకర్. రోబో హీరో రజినీనే అయినప్పటికీ.. సీక్వెల్‌ను ఇంకో హీరోతో తీద్దామని చూశాడు. తర్వాత రజినీతోనే ఫిక్సయ్యాడు. ఇందులో కీలకమైన విలన్ పాత్రకు దేశంలోని చాలా మంది టాప్ యాక్టర్స్‌ పేర్లను పరిశీలించాడు. కానీ ఎవ్వరూ ఆనకపోతే హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌పై దృష్టిపెట్టాడు. ఇక రోబో సినిమాలో హీరోయిన్ కూడా చాలా కీలకమైందన్న సంగతి తెలిసిందే. మరి రజినీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నదానిపైనా ఆసక్తి నెలకొంది. ఈ పాత్రకు అమీ జాక్సన్ పేరు వినిపించింది.

ఐతే రోబో-2 విషయంలో ఇప్పటిదాకా వచ్చిందంతా ఊహాగానాలే. కాస్టింగ్ విషయంలో ఏ అధికారిక ప్రకటనా రాలేదు. ఐతే అమీ జాక్సన్ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రోబో-2లో నటించబోతున్న మాట వాస్తవమే అని చెప్పింది. ‘‘శంకర్ దర్శకత్వంలో ఒక్కసారి నటించడమే అదృష్టం. కానీ నాకు రెండో అవకాశం కూడా వచ్చింది. రోబో-2లో రజినీకాంత్ సరసన నటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని అమీ చెప్పింది. ఐతే ఇదే సమయంలో రోబో-2లో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ నటించట్లేదన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే అమెరికాకు వెళ్లి ఆర్నాల్డ్‌ను కలిసిన శంకర్, నిర్మాతలకు అతడి డిమాండ్లు అతిగా అనిపించాయట. ఇలా అయితే కష్టం అని ఇండియన్ యాక్టర్‌నే విలన్ పాత్రలో నటింపజేద్దామా అని ఆలోచిస్తున్నాడట శంకర్.

దావుద్‌ను చేజేతులా వ‌దిలేసుకున్నారు
రామ్ చ‌ర‌ణ్ రిస్క్ చేస్తున్నాడా!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*