మోడీని ఒబామా కూడా కాపాడ‌లేడు

Share this News:

భారత ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత ప్రియ‌మైన దేశ‌మైన అమెరికాలో చుక్కెదురు అయింది. ఆ దేశాధినేత ఒబామాతో చ‌క్క‌టి చ‌నువు ఉన్న మోడీకి ఇపుడు ఒబామా కూడా స‌హ‌క‌రించలేని పరిస్థితులు అమెరికా గ‌డ్డ‌పై ఏర్పాడ్డాయి. ఇంత‌కూ విష‌యం ఏంటంటే  మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో జరిగిన మతఘర్షణల్లో ఆయన పాత్రకు సంబంధించి ఆగ్రహించిన అమెరికా 2005లో ఆయన పర్యాటక వీసాను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే మోడీ ప్ర‌ధాన‌మంత్రి అయిన త‌ర్వాత నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

దీనిపై అమెరికా ఫెడరల్‌ కోర్టులో కేసు న‌మోదైంది.మోడీ అమెరికా ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయటానికి సంబంధించిన ప్రాథమిక రికార్డులు జనవరి రెండోవారంలోగా తమకు అందచేయాలని న్యాయమూర్తి విదేశాంగశాఖను ఆదేశించారు. దీంతో పాటు పూర్తి రికార్డులను ఫిబ్రవరి నాటికి అందచేయాలని న్యూయార్క్‌ సదర్న్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ జాన్‌ జి కోయెల్ట్ ఆర్డ‌ర్ వేశారు. అమెరికా మత స్వేచ్ఛ చట్టం పరిధిలో వీసా తిరస్కరణకు గురైన ఏకైక వ్యక్తి మోడీ అన్న విషయం తెలిసిందే. అయితే భార‌త్‌తో సంబంధాలు బ‌ల‌ప‌ర్చుకోవాల‌ని భావించిన అమెరికా ఈ మేర‌కు మోడీ వీసాకు ఓకే చెప్పింది. అనంత‌రం అమెరికాలో మోడీ ప‌ర్య‌ట‌న దిగ్విజ‌యంగా పూర్తిచేసుకున్నారు.

దావుద్‌ను చేజేతులా వ‌దిలేసుకున్నారు
రాజ్యసభలో ముగ్గురు మొనగాళ్లు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*