​చిరు 150వ సినిమా క‌న్‌ఫర్మ్‌

Share this News:

మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయ‌న 150వ చిత్రం ఖరారైంది. టాలీవుడ్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయ‌డంలో తిరుగులేని పేరు సంపాదించుకున్న స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయక్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘కత్తి’ను రీమేక్ చేస్తున్నట్టు చిరు తనయుడు రామ్ చరణ్ ప్రకటించారు. రిట్జ్ ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయిన చరణ్ ఈ వార్తను చెప్పారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ ఫ్యాన్స్ దాదాపుగా రెండు సంవ‌త్స‌రాలుగా వెయిట్ చేస్తున్నారు. 2007లో వ‌చ్చిన శంక‌ర్‌దాదా జిందాబాద్ సినిమా త‌ర్వాత చిరు హీరోగా న‌టించిన సినిమా ఏదీ రాలేదు.

 2009లో చెర్రీ మ‌గ‌ధీర సినిమాలో ఓ పాట‌లో నటించిన చిరు రీసెంట్‌గా వ‌చ్చిన బ్రూస్‌లీలో ఓ సీన్‌లో త‌ళుక్కుమ‌న్నారు. ఆయ‌న పూర్తి స్థాయి హీరోగా న‌టించే సినిమా కోసం ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. ‘అఖిల్’ పరాజయంతో చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వివి వినాయక్ కోల్పోయారని మీడియాలో పుకార్లు వినిపించాయి. అవన్నీ ఒట్టి మాటలేనని చరణ్ ప్రకటనతో స్పష్టమైంది. వినాయక్ దర్శకత్వంలో చిరు నటించిన ‘ఠాగూర్’ ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఆ తరహా విజయం కోసం చిరు, వినాయక్ జత కట్టనున్నారు. తమిళంలో మంచి విజయం సాధించిన ‘రమణ’కు రీమేక్ ‘ఠాగూర్’. తమిళంలో మురుగదాస్ దర్శకత్వం వహించారు.

 ఇక ప్ర‌స్తుతం రీమేక్ చేసే క‌త్తి సినిమా గ‌తేడాది దీపావ‌ళికి కోలీవుడ్‌లో రిలీజ్ అయ్యి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా…విజ‌య్‌-స‌మంత జంట‌గా న‌టించారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెర‌కెక్కింది. ఏదేమైనా చెర్రీ ప్ర‌క‌ట‌న‌తో మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ మొద‌లైంది.

మ‌హేష్ మూవీలో హాలీవుడ్ హీరో
టాంటెక్స్ స్వరమంజరి: నిన్నటి కల…నేటి నిజం!

Share this News:

1 Comment on ​చిరు 150వ సినిమా క‌న్‌ఫర్మ్‌

  1. Chiru destroyed crebility of Kapu community

Leave a comment

Your email address will not be published.

*