మ‌హేష్ మూవీలో హాలీవుడ్ హీరో

Share this News:

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో ఓ భారీ చిత్రం తెర‌కెక్కేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ మార్ష‌ల్ ఆర్ట్స్ చిత్రాల క‌థానాయ‌కుడు జాకీచాన్ న‌టిస్తాడ‌ని స‌మాచారం. రూ.100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ సినిమాలో నిన్న‌టి వ‌ర‌కు ఓ ప్ర‌ముఖ హాలీవుడ్ స్టార్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కూడా ధృవీక‌రించారు. అయితే ఆ స్టార్ హీరో పేరు చెప్పేందుకు మాత్రం పూరి నో చెప్పాడు.

 అయితే ఫిల్మ్‌న‌గ‌ర్ నుంచి విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం జాకీచాన్‌ త‌మ మూవీలో న‌టింప‌జేసేందుకు పూరి సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌.  ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్ సినిమాల‌తో  హీరో మహేష్‌బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్ లది హిట్ కాంబినేషన్ అని ప్రూవ్ అయింది. ఈ కాంబినేషన్ లో మూడో చిత్రం వ‌స్తుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నా అది ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. గ‌తంలో ఈ కాంబోలో బిజినెస్‌మేన్ సీక్వెల్ వ‌స్తుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా స్థానంలో ఓ స‌రికొత్త స్టోరీతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంద‌ని తెలుస్తోంది.

 ఈ సినిమా గురించి ఇటీవ‌ల మాట్లాడిన పూరి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు. ప్రస్తుతం జాకీ చాన్ నటిస్తున్న ‘కుంగ్ ఫూ యోగా’లో సోనూ సూద్ నటిస్తున్నారు. తెలుగులో సోనూ కెరీర్ కి మంచి బ్రేక్ అయిన చిత్రం పూరీ దర్శకత్వం వహించిన సూపర్‌.  పూరి-సోను సూద్ మ‌ధ్య ఉన్న అనుబంధంతో సోనూ ద్వారా పూరి జాకీచాన్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌లో బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టించే సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. అంటే మ‌హేష్‌-పూరి సినిమా 2017లో ప‌ట్టాలెక్కే ఛాన్సులు ఉన్నాయి.

మ‌హేష్ బావ కూడా మొద‌లెట్టాడు!
​చిరు 150వ సినిమా క‌న్‌ఫర్మ్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*