క‌త్తి టీం ఎంపిక క‌త్తిమీద సామే

Share this News:
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా(బ్రూస్‌లీతో క‌లుపుకుని) ఎట్ట‌కేల‌కు ఖ‌రారైంది. ఈ సినిమా కోసం మెగాఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సినిమా ఫ్యాన్స్ అంద‌రూ దాదాపు రెండు సంవ‌త్స‌రాలుగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి చిరు త‌న‌యుడు చెర్రీ స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో ఉన్న క‌న్‌ఫ్యూజ‌న్ తొల‌గిన‌ట్ల‌య్యింది. కోలీవుడ్‌లో విజ‌య్ హీరోగా గ‌తేడాది వ‌చ్చిన క‌త్తి సినిమాను రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న రావ‌డం వ‌ర‌కు ఓకే అయినా ఇప్పుడు ఈ సినిమా టీం ఎంపిక చిత్ర యూనిట్‌కు పెద్ద క‌త్తిమీద సాములా మారింద‌ట‌.
   ఎనిమిది సంవ‌త్స‌రాల విరామం త‌ర్వాత చిరు హీరోగా న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. చిరు ప‌క్క‌న హీరోయిన్లుగా ఎవ‌రు ఉండాలి… విల‌న్ ఎవ‌రు… ఇత‌ర సాంకేతిక నిపుణులుగా ఎవ‌రిని ఎంపిక చేయాలనే అంశంపై డైరెక్ట‌ర్ వినాయ‌క్‌, నిర్మాత చెర్రీ, అల్లు అర‌వింద్ త‌దిత‌రులు ఓ క్లారిటీకీ రాలేక‌పోతున్నార‌ని స‌మాచారం. ఈ ప్రెస్టేజియ‌స్ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. వాటిని రీచ్ అయ్యేలా చేయాల్సిన‌ బాధ్యత దర్శకుడు వినాయక్‌పై వుంది. అల్లుడు శ్రీను… అఖిల్ వంటి వరుస ఫ్లాపులున్నా చిరంజీవి వినాయక్‌నే సెలెక్ట్ చేసుకోవడం వెనకాల సెంటిమెంట్ వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఠాగూర్ హిట్ అయింది. ఆ సినిమా కూడా త‌మిళంలో హిట్ అయిన ర‌మ‌ణ‌కు రీమేక్‌. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ప్ర‌కారం అక్క‌డ హిట్ అయిన క‌త్తి సినిమా రీమేక్‌నే చిరు ఎంచుకున్నారు.
   చిరు కేరీర్‌లోనే గుర్తుండిపోయేలా ఈ సినిమా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు ప‌క్క‌న న‌టించే హీరోయిన్ల విష‌యంలో త‌మ‌న్నా, న‌య‌న‌తార పేర్లు వినిపిస్తున్నాయి. న‌య‌న‌తార డేట్లు వ‌చ్చే ఏడాది ఫుల్ బిజీ అట‌. కాజల్.. సమంత.. శృతి.. తమన్నా చెర్రీతో ఆడిపాడేశారు. త‌మ‌న్నాతో న‌టించాల‌ని ఉంద‌ని చిరు అన్నా ఆమె చిరు ప‌క్క‌న సెట్ కాద‌న్న మీమాంస‌లో యూనిట్ ఉంద‌ట‌. సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీప్ర‌సాద్‌-థ‌మ‌న్‌-కీర‌వాణి-అనూప్ పేర్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్నా హ‌రీష్‌జైరాజ్ పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. ఇంకా ఈ సినిమా సంగీత ద‌ర్శ‌కుడిపై కూడా చిత్ర యూనిట్ ఓ నిర్ణ‌యానికి రాలేదు. ఈ సినిమాలో కీల‌క‌మైన రోల్ కోసం మాత్రం బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ పేరు వినిపిస్తోంది. మిగిలిన టెక్నీషియ‌న్ల‌తో పాటు న‌టుల ఎంపిక విష‌యంలో కూడా వినాయ‌క్ అండ్ టీం తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంద‌ట‌. ఏదేమైనా చిరు క‌త్తి సినిమా రీమేక్‌కు టీం ఎంపిక యూనిట్‌కు క‌త్తిమీద సాములానే క‌నిపిస్తోంది.
బీహార్ మ‌ద్య నిషేధం… అంతా తూచ్
అబ్బాయి మీద ప్రేమ‌తో బాబాయి వ‌స్తున్నాడు!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*