చిరు సినిమాకు అంత రెమ్యునరేష‌నా..!

Share this News:

మెగాస్టార్ చిరంజీవి కేరీర్‌లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న 150వ సినిమా షూటింగ్‌కు త్వ‌ర‌లోనే ముహూర్తం ఫిక్స్ కానుంది. ఎన్నాళ్ళగానో మెగా అభిమానులని ఊరిస్తూ.. ఊపేస్తున్న విషయం చిరు 150వ సినిమా. అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు చిరుని హీరోగా వెండి తెరపై తిరిగి చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇటీవ‌ల చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డిన‌ట్ల‌య్యింది. ఈ ప్రెస్టేజియ‌స్ మూవీని చిరు స‌తీమ‌ణి సురేఖ స‌మ‌ర్పణ‌లో చెర్రీ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు క‌త్తి సినిమా త‌మిళ వెర్ష‌న్‌ను నిర్మించిన లైకా సంస్థ కూడా భాగ‌స్వామిగా ఉండ‌నుంద‌ట‌.

 క‌త్తి సినిమాను త‌మిళంలో లైకా సంస్థే నిర్మించింది. అలాగే ఇదే లైకా సంస్థ కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌-శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ప్రెస్టేజియ‌స్ మూవీ రోబో 2ను కూడా నిర్మిస్తోంది. రోబో 2 సినిమా కోసం ర‌జ‌నీకి రూ.30 కోట్ల పారితోష‌కం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు చిరు 150వ సినిమాకు కూడా అదే పారితోష‌కాన్ని మెగాస్టార్‌కు ఇవ్వాల‌ని లైకా డిసైడైన‌ట్టు తెలుస్తోంది.

 చిరంజీవి 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు మాజీ కేంద్ర మంత్రి. దీంతో ఈ సినిమాపై సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. వ‌చ్చే జ‌న‌వ‌రి త‌ర్వాత ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టుల‌తో పాటు సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది.

ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
ఊపిరి స‌ల‌ప‌ని ఆలోచ‌న‌లో నిర్మాత‌లు!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*