రజినీ, కమల్ తలపడాల్సింది కానీ..

Share this News:

తమిళంలో బిగ్ స్టార్.. బహుముఖ పాత్రలో పోషించగల నటుడు.. అనగానే ఎవరికైనా కమల్ హాసన్ కాకుండా ఇంకెవరు తడతారు చెప్పండి? ఈ మాత్రం హింట్ ఇస్తే సరిపోదూ రోబో-2లో విలన్ పాత్రకు ముందు ఎవరిని అనుకున్నారో చెప్పడానికి. ఇంతకీ శంకర్, కమల్ హాసన్‌ల మధ్య చర్చలు జరిగాయో లేదో తెలియదు కానీ.. రోబో-2లో విలన్ పాత్రను కమల్ కోసమే తీర్చిదిద్దామని చెప్పకనే చెప్పేశాడు రచయిత జయమోహన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోబో-2 విశేషాలు వెల్లడిస్తూ ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎవరెవరిని అనుకున్నది.. చివరికి అక్షయ్ కుమార్‌నే ఎందుకు ఎంచుకున్నది వెల్లడంచాడు జయమోహన్.

‘రోబో’తో పోలిస్తే రోబో-2లో విలన్ పాత్ర చాలా బలమైందని.. ఎంతో కీలకమైందని.. అందుకే ఈ పాత్రకు ప్రముఖ నటుల్నే ఎంచుకుందామని అనుకున్నామని చెప్పాడు జయమోహన్. తమిళంలో బహుముఖ పాత్రలు పోషించగల ఓ పెద్ద స్టార్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు చెప్పడం ద్వారా కమల్ హాసన్‌ను గుర్తుకు తెచ్చారాయన. ‘రోబో’కు సీక్వెల్ అనగానే విలన్ పాత్రకు వినిపించిన పేరు కమల్‌దే అన్న సంగతి తెలిసిందే. ఇక ఆర్నాల్డ్‌ను విలన్ పాత్రకు తీసుకోవాలన్నది కూడా వాస్తవమే అని చెప్పాడు జయమోహన్. ఐతే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ లాస్ విషయంలో తలెత్తిన ఇబ్బందుల వల్ల ఆయన్ని ఈ సినిమాలో నటింపజేయలేక పోయామన్నాడు. ఆర్నాల్డ్‌ను వద్దనుకున్నపుడు.. అక్షయ్ తప్ప ఇంకో ఛాయిస్ కనిపించలేదని జయమోహన్ తెలిపాడు.

రాజ‌మండ్రి విష‌యంలో బాబు అన్నంత ప‌నిచేశారోచ్‌
జ‌బ‌ర్ద‌స్త్‌కు రోజా గుడ్ బై..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*