జ‌న‌తా గ్యారేజ్ మెకానిక్ గా ఎన్టీఆర్

Share this News:

ఇటీవ‌ల ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వ‌లో జ‌న‌తా గ్యారేజ్ సినిమా ఆ సంస్థ కార్యాల‌యం లో ప్రారంభమైన విష‌యం తెలిసిందే. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన నిర్మాత‌లే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు అన్నీ పూర్త‌య్యాయ‌ట‌. ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ హీరోయిన్ సెర్చెంగ్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న రామ‌య్యా వ‌స్తావ‌య్య చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన శృతిహాస‌న్ ఈ చిత్రంలో  కూడా హీరోయిన్ గా నటించ‌నుంద‌ని స‌మాచారం. ఈమెతో ఇప్ప‌టికే చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు శ్రీమంతుడు చిత్రానికి ప‌ని చేసి ఉండ‌టంతో వారు కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో హీరోయిన్ ని ఫైన‌ల్ చేసి ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించ‌డానికి స‌ర్వ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇందులో ఎన్టీఆర్ జ‌న‌తా  గ్యారేజ్ కి చెందిన  మెకానిక్ గా న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. లుక్ ప‌రంగా, బాడీ లాంగ్వేజ్ ప‌రంగా కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉండేలా ఎన్టీఆర్ పాత్ర‌ను డిజైన్ చేశాడ‌ట కొర‌టాల శివ‌. దేవిశ్రీప్ర‌సాద్ సంగీత సార‌థ్యంలో ఇప్ప‌టికే రెండు పాట‌లు కంపోజ్ చేయ‌డం రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యాన్ని స‌మ‌కూర్చ‌డం జరిగిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టిస్తున్న నాన్న‌కు ప్రేమ‌తో షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ నెల 27 ఆడియో గ్రాండ్ గా శిల్పాక‌ళా వేదిక లో ఆడియో విడుద‌ల చేసి, జ‌న‌వ‌రి 13న సంక్రాంతి కానుక‌గా సినిమాను  విడుద‌ల చేయ‌నున్నారు.

రేపిస్ట్ : పాతికేళ్లలో 12 వేల మందిపై అత్యాచారం 
అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి కొత్త లీడర్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*