ఫిబ్ర‌వ‌రి 10.. రామ్ చ‌ర‌ణ్ కొత్త డేట్

Share this News:
రామ్ చ‌ర‌ణ్ హీరోగా త‌ని ఒరువ‌న్ అనే త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి డైర‌క్ట్ చేస్తున్నఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే  ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ చిత్రాన్ని మొద‌ట సంక్రాంతి రోజున ప్రారంభించాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 10న షూటింగ్ లాంచ‌నంగా  ప్రారంభించి మార్చి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌నున్నార‌ని  తెలుస్తోంది.
అల్లు అర‌వింద్, ఎన్ వి ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడుగా ఓ బాలీవుడ్ యాక్ట‌ర్ని ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే సాంకేతిక నిపుణుల‌తో పాటు న‌టీన‌టుల ఎంపిక పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. బ్రూస్‌లీ ఘోర పరాజ‌యం పాల‌వ‌డంతో ఈ చిత్రానికి రామ్ చ‌ర‌ణ్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు వినికిడి. ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్  నిర్మించ‌నున్న‌ చిరు 150 వ సినిమా జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.
ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అత్యాచారం !
శ్రీమంతుడు సెంటిమెంట్‌తో నాన్న‌కు ప్రేమ‌తో

Share this News:

Leave a comment

Your email address will not be published.

*