చిరు రెమ్యున‌రేష‌న్ ఫిక్స‌యిన‌ట్టే..!

Share this News:
 
 
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని టాలీవుడ్ సినీ జ‌నాల‌తో పాటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ప్ర‌క‌ట‌న కోసం రెండు సంవ‌త్స‌రాలుగా వెయిట్ చేస్తున్నా ఇప్ప‌ట‌కీ షూటింగ్ స్టార్ట్ కాలేదు. ద‌స‌రా, దీపావ‌ళి, క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ ఎప్పుడు చిరు 150వ సినిమా స్టార్ట్ అవుతుందా అని కోటి ఆశ‌ల‌తో ఉన్న చిరు ఫ్యాన్స్‌కు కొత్త సంవ‌త్స‌రం రోజు కూడా నిరాశే ఎదురైంది. తాజాగా ఫిల్మ్‌న‌గ‌ర్ నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం సంక్రాంతికి కాదుక‌దా జ‌న‌వ‌రి ఎండింగ్‌లో కూడా చిరు సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్సులు క‌న‌ప‌డ‌డం లేదు.  అయితే ఈ సినిమా సెట్స్ కెళ్లకముందే బోలెడన్ని సెన్సేషనల్ విషయాలు తెలుస్తున్నాయ్. 
   ఈ సినిమా కోసం చిరు తీసుకునే పారితోష‌కం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద ట్రెండింగ్‌గా మారింది. టాలీవుడ్ లో ఇంతవరకూ ప్రిన్స్ మ‌హేష్‌బాబు శ్రీమంతుడు సినిమాకు రెమ్యున‌రేష‌న్‌+షేర్‌తో క‌లుపుకుని రూ.25 కోట్ల వ‌ర‌కు తీసుకున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఈ మ‌హేష్ పారితోష‌కాన్ని క్రాస్ చేసేలా చిరు 150వ సినిమాకు రూ.30 కోట్ల పారితోషికం మెగాస్టార్ అందుకుంటున్నారన్నది ఫిల్మ్‌న‌గ‌ర్ హాట్ న్యూస్‌. అయితే చిరుకు ఈ మొత్తాన్ని క్యాష్ రూపంలోనే సెటిల్ చేస్తారా లేదా కొన్ని ఏరియాల రైట్స్ రూపంలో ఇస్తారా అన్న‌ది తెలియ‌డం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాను చిరు త‌న‌యుడు చెర్రీతో పాటు క‌త్తి సినిమా త‌మిళ్ వెర్ష‌న్ నిర్మించిన లైకా సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీంతో చిరు పారితోష‌కం గురించి ముందుగానే మాట్లాడుకోవాల్సి వ‌చ్చింది.
   చిరు స‌తీమ‌ణి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో చెర్రీ-లైకా సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి టాలీవుడ్ టాప్ మోస్ట్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరాడే వ్య‌క్తి క‌థ‌తో తెర‌కెక్కే ఈ సినిమా స్టోరీ లైన్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉంటుంది.
రూ.2 కోట్లిచ్చి.. పోటీ నుంచి త‌ప్పుకున్నా
డిక్టేట‌ర్ శాటిలైట్ రైట్స్ అదుర్స్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*