బాహుబ‌లి ఆ వీడియోలో ఉన్నాడ‌ట‌!

Share this News:
ఇటీవ‌ల చెన్న‌య్ ని వ‌ర‌ద‌లు చుట్టు ముట్టి  ఛిన్నాభిన్నం చేసిన విష‌యం తెలిసిందే. అయితే చెన్సై బాధితుల‌కు అన్ని భాష‌ల సినీ తార‌లు త‌మ వంతుగా సాయం అందించారు. వారికి ట్రిబ్యూట్ గా ఓ వీడియో సాంగ్ ని రూపొందిస్తున్నార‌నే వార్త ఇటీవ‌ల బాగా వినిపిస్తోంది. ఈ వీడియో సాంగ్ ని హీరో విక్ర‌మ్ డైర‌క్ట్ చేస్తున్నాడ‌ట. చెన్నైలో వ‌ర‌ద‌ల కార‌ణంగా దెబ్బ‌తిన్న ఏరియాల‌ను అన్నింటిని ఇటీవ‌ల  షూట్ చేశార‌ట‌. అలాగే వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వీడియోల‌ను సేక‌రించి…అన్నింటిని క‌లిపి ఓ ఆరు నిమిషాల డ్యూరేష‌న్ వ‌చ్చేలా  ఓ వీడియో సాంగ్ ని రూపొందిస్తున్నార‌ట‌. దీన్ని రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తాజా స‌మాచారం.
ఈ వీడియోలో విజ‌య్, సూర్య‌, విక్ర‌మ్, బాబీ సంహా, హ‌న్సిక‌, శృతి హాస‌న్, నిత్యామీన‌న్ తో పాటు తెలుగు, క‌న్న‌డ, మ‌ల‌యాళ  సినీ ప‌ర‌శ్ర‌మ‌కు సంబంధించిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ వీడియో సాంగ్ లో పాల్గొనే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి పునీత్ రాజ్ కుమార్, నివీన్ పాలీ పాల్గొన‌గా తెలుగు ప‌రిశ్ర‌మ  నుంచి మ‌న  బాహుబ‌లి  ప్ర‌భాష్ వీడియో సాంగ్ లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇలా అన్ని భాష‌ల వారు ఒక మంచి కార్య‌క్ర‌మం కోసం రూపొందిస్తున్న ఈ వీడియో ఆల్బం ఎప్పుడెప్పుడు చూడాలా? అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో తెలుగులో సిని ప‌రిశ్ర‌మ త‌ర‌పున ఆ వీడియో సాంగ్ లో  ప్ర‌భాష్ పాల్గొన‌డంతో క్యూరియాసిటీ మ‌రింత పెరిగింది అన‌డంలో సందేహం లేదు.
​ఇమ్మిగ్రేషన్ చిక్కుముడిని ఎలా విప్పాలంటే?
రోజా హిస్ట‌రీతో సినిమా వ‌స్తోంది..!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*