ఎన్నారైలకు ప్ర‌భుత్వ శుభవార్త​ 

Share this News:
విదేశాల్లో ఉన్న భారతీయుల డిమాండ్‌కు ఎట్ట‌కేల‌కు మోక్షం ల‌భించింది. భార‌త‌దేశంలో త‌మకు ఓటు హ‌క్కు, ఆధార్ కార్డు కావాల‌నే వారి డిమాండ్‌లో కీల‌క‌మైన ఆధార్ కార్డుపై కేంద్రం సుముఖంగా ఉంది. ఎన్నారైల‌కు ఆధార్‌ కార్డును అందిచాలని కేంద్రం యోచిస్తోందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మాస్వరాజ్ ప్ర‌క‌టించారు. దేశ అభివృద్ధిలో ప్రవాసీయులు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని కొనియాడారు.
దేశంలో వృద్ధి రేటును పెంచేందుకు ప్రవాస భారతీయుల సేవలను ఆహ్వనిస్తున్నామ‌ని సుష్మాస్వ‌రాజ్ చెప్పారు. గల్ఫ్‌ దేశాల్లో పని చేసేందుకు వెళ్లే మహిళలు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారానే వెళ్లాలని ఆమె సూచించారు. తద్వారా వారు మోసపూరిత ఏజెంట్లు, సంస్థల బారినుండి తప్పించుకోవచ్చన్నారు. ఢిల్లీలో జ‌రిగిన ఓ స‌మావేశంలో సుష్మా ఈ మేరకు హామీ ఇచ్చారు. అయితే ఓటు హక్కు కల్పించడంపై ప్రాథమిక స్థాయిలోనే ప్రతిపాదనలు ఉన్నట్లు సుష్మాస్వరాజ్ వివరించారు.
బాబు తడాఖా​:​ ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల కోట్లు​ 
అరుణ్‌జైట్లీ ఆర్థిక భ‌రోసా నిల‌బెట్టుకునేదేనా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*