కేసీఆర్ ను బాలయ్య ఎందుకు కలిశారు?

Share this News:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నటుడు, ఏపీలోని హిందూపురం  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రితో బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి అంశంపై బాలకృష్ణ చర్చించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా రోగులకు ఆసుపత్రి అందిస్తున్న సేవలను వివరించారు. రోగుల బంధువుల కోసం ఆసుపత్రి సమీపంలో షెల్టర్లు నిర్మించాలని కేసీఆర్‌ను బాలకృష్ణ కోరారు. దీనికి స్పందించిన కేసీఆర్‌ ప్రభుత్వ, ప్రయివేటు అనే భేదం లేకుండా అన్ని ఆసుపత్రుల వద్ద షెల్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా బాలకృష్ణ,  కేసీఆర్‌ ల భేటీ అరగంట పాటు  జరిగింది. ఇద్దరూ పలు అంశాలపై చర్చించారు. బసవతారకం ఇండో- అమెరికన్క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అందిస్తున్న సేవలను కేసీఆర్‌కు బాలకృష్ణ వివరించారు.  ఇద్దరూ సరదాగా  మాట్లాడుకుంటున్న సమయంలో బాలయ్య… ఇటీవల విడుదలైన తన డిక్టేటర్ సినిమాను చూడాలని కేసీఆర్‌ను కోరారట. అందుకు అంగీకరించిన కేసీఆర్ బాలయ్య 100వ సినిమా విషయం అడిగినట్టు తెలుస్తోంది. ఆదిత్య 369కు సీక్వెల్‌గా వందో సినిమా చేస్తున్నానని బాలయ్య తెలిపారు. కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నానని చెప్పారు బాలయ్య. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ చిత్రాలను తాను బాగా చూసేవాడినని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వకంగా సంభాషణలు సాగాయని చెప్తున్నారు. మొత్తానికి బావబావమరుదులు ఇద్దరూ కేసీఆర్ తో దోస్తీ బాగానే సాగిస్తున్నారు.
సంక్రాంతి సినిమాల్లో నెంబర్ వన్ ఏది?
బాబోయ్ : ఇదేం వాదన జగన్

Share this News:

Leave a comment

Your email address will not be published.

*