పదిమందికి పద్మ విభూషణ్

Share this News:
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన పద్మ అవార్డులలో పది మందికి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. మొత్తం 118 మందికి ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు దక్కగా వారిలో పది మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్ అవార్డులు లభించాయి. మిగిలిన వారికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
పద్మవిభూషణ్ వరించినవారిలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, మీడియా దిగ్గజం రామోజీరావు ఉన్నారు. నర్తకి యామినీ కృష్ణమూర్తికీ ప‌ద్మ విభూష‌ణ్ ల‌భించింది.  అనుప‌మ్ ఖేర్, గాయ‌కుడు ఉదిత్ నారాయ‌ణ్ కు ప‌ద్మ భూష‌ణ్ అవార్డు వ‌రించింది. సినీనటులు ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్ లకు పద్మశ్రీ పురస్కారం లభించింది.అలాగే తెలుగు దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ పురస్కారం దక్కింది.  ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది.
భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు పద్మ భూషణ్ అవార్డు లభించింది.సైనా నెహ్వాల్ లకు పద్మ భూషణ్ లభించింది. ఈ రోజు సాయంత్రం కానీ, రేపు కానీ అధికారికంగా జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
డిక్టేటరే తప్పుకుని ఉంటే పోయేదిగా..
రామోజీకి పద్మవిభూషణ్.. రాజమౌళికి పద్మశ్రీ

Share this News:

Leave a comment

Your email address will not be published.

*