ఎన్టీఆర్ ఆ మార్క్ క్రాస్ చేశాడు!

Share this News:

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  న‌టించిన  తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ  సినిమా సంక్రాంతి కానుక‌గా రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. తొలి రోజు మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆ త‌ర్వాత పాజిటివ్  టాక్ తో రన్ అవుతూ మంచి  క‌లెక్ష‌న్స్ తో రాబ‌డుతోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు  ఎన్టీఆర్ సినిమాలు 50 కోట్ల క్ల‌బ్ లో చేర‌లేదు. బాద్ షా సినిమా కూడా 47 కోట్ల వ‌ద్ద‌నే ఆగిపోయింది. అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ అభిమానులు 50 కోట్లు షేర్ వ‌సూలు చేసే సినిమా ఎప్పుడు వ‌స్తుందా? అని ఎదురుచూసారు.
అయితే నాన్న‌కు ప్రేమ‌తో విడుద‌ల కాక ముందు మంచి అంచ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ…విడుద‌ల‌య్యాక మాత్రం మిక్స్డ్  టాక్ తెచ్చుకుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా కూడా 50 కోట్ల క్ల‌బ్ లో చేర‌డం క‌ష్ట‌మ‌నుకున్నారు. కానీ నేటితో ఈ సినిమా 50 కోట్ల మ‌ర్క్ ని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లో యాభై కోట్ల క్ల‌బ్ లో చేరిన తొలి చిత్రంగా నాన్న‌కు ప్రేమ‌తో నిలిచింది.

కేటీఆర్ అన్నకు తమ్ముడు లోకేశ్ పంచ్ పడింది
త‌మ్ముడూ లోకేశ్‌…ముందు ఏపీని చూసుకో

Share this News:

Leave a comment

Your email address will not be published.

*