తననెవరు పెళ్లి చేసుకోరంటున్న రానా!

Share this News:

‘లీడర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయిన నటుడు రానా. లవర్ బాయ్ గా పూరి సినిమాలో కనిపించినా రానాకు మాత్రం పెద్దగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాతో తనలో ఉన్న కొత్త యాంగల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తరువాత అడపాదడపా చిత్రాల్లో కనిపించినా రానాకు పెద్దగా పేరు రాలేదు. ఒకానొక సమయంలో హీరోగా రానా పనైపోయిందనుకున్నారంతా.. కాని రాజమౌళి చేసిన ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందాడు.

అయితే రీసెంట్ గా రానా తన పెళ్లి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి చిత్రం తరువాత తననెవరూ కూడా పెళ్లి చేసుకోరని రానా తెలిపాడు. రానా తమిళం లో నటించిన ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ.. ”ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాను. ఈ చిత్రాలు పూర్తయ్యే సరికి మరో ఏడాది పడుతుంది. ఆ తరువాతే నేను పెళ్లి చేసుకుంటానని” చెప్పాడు. బాహుబలి చిత్రంలో తన క్రూరత్వాన్ని చూసిన తరువాత బహుశా ఏ అమ్మాయి కూడా తనను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదని రానా సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఘాజి, బాహుబలి ది కంక్లూషన్’ చిత్రాల్లో రానా బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సీక్వెల్ లో రానా నటించనున్నాడు.

బన్నీ చరణ్ ను దాటేస్తున్నాడు..! 
నాటా ‘మీట్ అండ్ గ్రీట్’కు అద్భుత స్పందన

Share this News:

Leave a comment

Your email address will not be published.

*