చిరుకి లవ్ సెట్ అవ్వదా..?

Share this News:

చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన 150వ చిత్రాన్ని ఎంతో పకడ్బందీగా రూపొందిస్తున్నారు. ‘కత్తి’ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. తమిళ ‘కత్తి’  సినిమాలో వచ్చే ప్రతి పాత్రని, కథనంలో ఉండే నిజాయితీని తెలుగులో ఒడిసి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ వర్క్ చేయడానికి మెగాస్టార్ సీనియర్ రచయితలను పనిలో పెట్టుకున్నారు. ‘కత్తి’ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు.

అందులో ఒక పాత్రకు సమంతాను జోడీగా పెట్టి మంచి రొమాంటిక్ ట్రాక్ ను యాడ్ చేశాడు దర్శకుడు మురుగదాస్. అయితే తెలుగులో మాత్రం ఈ రొమాంటిక్ ట్రాక్ పెట్టాలనుకోవట్లేదట. చిరంజీవి ఇమేజ్ దృష్ట్యా ఈ వయసులో లవ్ స్టొరీ పెడితే బాగోదని చిత్రబృందం భావిస్తోంది. దానికి బదులుగా రైతుల కష్టాన్ని తెలియజేసే ఓ ట్రాక్ ను పెడుతున్నారని సమాచారం. సినిమా మొదటి భాగంలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాలని కొత్త హంగులను అద్దుతున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చిరు 150 వ చిత్రం ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే..!

పవన్ కు నమ్మకం లేకేనా అదంతా..?
పవన్  సినిమా లోగుట్టు ఏంటో

Share this News:

Leave a comment

Your email address will not be published.

*