ఎన్టీఆర్ సినిమా మొదలవ్వదా..?

Share this News:

‘నాన్న‌కు ప్రేమ‌తో’ సినిమా పూర్త‌యిన వెంట‌నే..  కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ‘జ‌న‌తా గ్యారేజ్’ ని ఎన్టీఆర్ సెట్‌పైకి తీసుకెళ్లాల‌ని భావించాడు. అయితే.. ఆ ప‌నులేం వేగంగా జ‌ర‌గ‌డం లేదని తెలుస్తోంది. నిజానికి జ‌న‌వ‌రి నెలలో ఈ సినిమాను మొదలు పెట్టాలనుకున్నారు. కాని ఫిబ్రవరి వరకు సినిమా స్టార్ట్ కాలేదు. ఫిబ్ర‌వ‌రి 10న మొద‌ల‌వుతుంద‌ని అందరూ అనుకున్నారు. అది కాస్త చివ‌రి వారానికి షిఫ్ట్ అయింది.
అయితే ఈ సినిమా ఇంకా లేట్ గా మొదలవుతుందనే వార్తలు ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ ఆధ్వ‌ర్యంలో ఈ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. సెట్ ను నిర్మించడంలో జ‌రుగుతున్న జాప్యం వలన ఈ సినిమా ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టాక్‌. అయితే.. ఆగ‌స్టు 12న మాత్రం ఎట్టిప‌రిస్థితిల్లోనూ ఈ సినిమాని విడుద‌ల చేయాల్సిందే అని ఎన్టీఆర్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే షూటింగ్ ఆల‌స్య‌మైనా… సినిమాను మాత్రం తొందరగా పూర్తి చేయాల‌ని కొర‌టాల‌కు ఆర్డ‌రు కూడా వేశాడు.

వారిద్దరి బ్రేకప్‌ ఇపుడు అఫిషియల్ 
గీతాఆర్ట్స్ లో సుక్కు సినిమా..?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*