చరణ్ బిజీ అయిపోయాడు!

Share this News:

ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ కు చెప్పుకోదగ్గ హిట్టు సినిమా పడలేదు. గతేడాది రిలీజ్ చేసిన ‘బ్రూస్ లీ’ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. దాంతో చరణ్ 2016వ సంవత్సరాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈసారి నుండి సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే కాకుండా.. కనీసం మూడు సినిమాలు చెయ్యాలని ప్రణాళిక వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టేశాడు. ముందుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘తని ఒరువన్’ రీమేక్ కు సిద్ధమవుతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు ముహూర్తాన్ని జరుపుకోనుంది.
ఇక రీసెంట్ గా సుకుమార్ చెప్పిన కథకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమానే తన రెండో చిత్రంగా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందట. గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలానే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా నటించడానికి అంగీకారం తెలిపాడట రామ్ చరణ్. కొరటాల ‘జనతా గ్యారేజ్’ తర్వాత చరణ్ సినిమా ఉంటుందట. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న చెర్రీకు ఈ మూడు చిత్రాలతో హిట్స్ వస్తాయేమో చూడాలి..!

మహేష్, శ్రీనువైట్లను అడగలేదట!
పెదనాన్న కోసం ప్రభాస్ బానే ప్లాన్ చేశాడు!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*