రానాకు బంపర్ ఆఫర్!

Share this News:

‘బాహుబలి’ సినిమాతో రానా ఇంటర్నేషనల్ రేంజ్ సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ ముందు వరకు రానా అంటే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ‘బాహుబలి’ తర్వాత రానా బాగా పాపులర్ అయ్యాడు.దీనికి తోడు తమిళంలో ఇటీవల రానా నటించిన ‘బెంగుళూరు నాట్కల్’ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో తమిళ ఇండస్ట్రీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు రానా వైపే మళ్ళింది.

తమిళ టాప్ డైరెక్టర్స్ బాల, అమీర్ లు రానాతో సినిమా చేయడానికి మక్కువ చూపుతున్నారు. విక్రమ్, సూర్య లాంటి నటులను స్టార్ హీరోలుగా మలిచిన బాల ఇప్పుడు రానాతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘కుట్రా పరంబరై’ అనే తమిళ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. బాలాతో పాటు ‘పరుత్తివీరన్’తో జాతీయ అవార్డులను కొల్లగొట్టిన మరో దర్శకుడు అమీర్ కూడా రానాతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇలా రానా వరుస సినిమాలతో కోలీవుడ్ లో బిజీ అవ్వబోతున్నాడు.

చైతుకి మాస్ ఇమేజ్ వస్తుందా..?
బాబుకు గ్రేట్ షాక్: దయా‘కార్’ కూడా ఎక్కేశారు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*