మహేష్ వదిలిన ట్రైలర్ థ్రిల్లింగ్..

Share this News:

క్షణం.. గత రెండు మూడు వారాలుగా టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ తో వచ్చేసింది. ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా ‘క్షణం’ ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. రెండు నిమిషాల ఈ థియేట్రికల్ ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. ఒక చిన్న పాప మిస్సింగ్ కేసు నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.

నా కూతురు కిడ్నాప్ అయిందంటూ తన మాజీ ప్రేయసి ఏడుస్తూ చెబుతుంది. ఎప్పుడో విడిపోయిన అమ్మాయి కోసం నీ పోరాటమేంటి అని ఫ్రెండు అభ్యంతరపెడుతున్నా హీరో ఆ చిన్న పాప కోసం వేట మొదలుపెడతాడు. ఈ కథలోకి పోలీసులు, రౌడీలు ఎంటరవుతారు. ఇక కథ అనేక మలుపులతో సాగిపోతుంది. ఆ థ్రిల్ మూమెంట్స్ అన్నీ ట్రైలర్లో శాంపిల్ గా చూపించారు.

అడివి శేష్ కెరీర్లో ది బెస్ట్ అనుకునే పాత్ర, సినిమా చేస్తున్నట్లున్నాడు. ఆదా కూడా బాగానే కనిపిస్తోంది. అనసూయ భరద్వాజ్ డిఫరెంట్ రోల్ లో దర్శనమిస్తోంది. శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. పీవీపీ సంస్థ నిర్మించింది. మార్చి 4న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తో గట్టి పంచే ఇచ్చింది.

సినిమా ఫీల్డే రిస్కు: ఆది
అబ్బో నానీ.. 130 స్క్రీన్లా?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*