బన్నీ అయినా సునీల్ ను కాపాడతాడా..?

Share this News:

మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో నో చెప్పిన కథ మరో హీరో సినిమా చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదొక సెంటిమెంట్ గా కూడా ఫాలో అవుతారు. అయితే ఇప్పడు అదే సెంటిమెంట్ ను నమ్ముకున్నాడు హీరో సునీల్. నిజానికి హీరో సునీల్ నటించిన ‘కృష్ణాష్టమి’ కథను మొదట అల్లు అర్జున్ కి వినిపించారట. అయితే అల్లు అర్జున్ కి స్క్రిప్ట్ నచ్చకపోవడంతో సున్నితంగా ఆ ప్రాజెక్ట్ ను తిరస్కరించాడు.

దిల్ రాజ్ మాత్రం ఆ ప్రాజెక్ట్ వదిలి పెట్టకుండా సునీల్ కు ఆ కథను చెప్పి ఒప్పించాడు. బన్నీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయాన్ని కూడా బయట పెట్టాడట. ఇక వెంటనే సునీల్ కు గత సెంటిమెంట్లు గుర్తుకు వచ్చి ఒక హీరో తిరస్కరించిన కథ తనకు సూపర్ హిట్ ఇస్తుంది అనే నమ్మకంతో ఒక్క క్షణం ఆలోచించకుండా ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించాడట. బన్నీ కోసం రాసుకున్న ఈ కథను సునీల్ కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా అయినా సునీల్ కి సక్సెస్ ఇస్తుందో.. లేదో.. చూడాలి..!

నాని డబుల్ ధమాకా!
శ్రీరస్తు, శుభమస్తు.. పోస్టర్ తేడాగా ఉందే

Share this News:

Leave a comment

Your email address will not be published.

*