మాట్రిమోనీ సైట్ల‌కు మూడింది

Share this News:

ఆన్‌లైన్ పెళ్లిళ్ల పేరయ్యలుగా ముద్రపడిన మాట్రిమోనియల్ వెబ్‌సైట్ల మోసాల‌కు ఇక క‌ళ్లెం ప‌డనుంది. సంబంధాలు కుదుర్చాల్సింది పోయి స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతున్న ఈ సైట్ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు, వీటి అండ‌గా వధూవరులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. మాట్రిమోనియల్ వెబ్‌సైట్లను అడ్డుపెట్టుకుని అమాయక యువతీ యువకులను వలలో వేసుకుని లక్షలు గడిస్తున్న మోసగాళ్లపై కుప్పలు తెప్పలుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ సమస్య పరిష్కారానికి అడ్డుకట్ట వేయడానికి స్కెచ్ డిసైడ్ చేసింది.

దేశంలో ప్రస్తుతం 402 మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇంటర్నెట్ యూజర్లలో చాలామంది వివాహం కోసం ఆన్‌లైన్ మాట్రిమోనియల్ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. తల్లితండ్రులు కూడా వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ల పట్ల మక్కువ చూపుతున్నారు. వివిధ గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలో ఆన్‌లైన్ పెళ్లిళ్ల మార్కెట్ సైజు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇదే స‌మ‌యంలో ఆన్‌లైన్ సైట్ల‌లో కోట్లాది రూపాయల వ్యాపారం చేసే మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు దాదాపు 20 ఉన్నాయి. ఉదాహరణకు భారత్ మాట్రిమోనికి 1.4 మిలియన్ల మంది, షాది.కామ్‌కు 1.2 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.ఇవికాకుండా ఆన్‌లైన్ పెళ్లిళ్ల వెబ్‌సైట్లు చాలా ఉన్నప్ప‌టికీ వీటిని నియంత్రించేందుకు నిబంధనలు లేవు.

సాధార‌ణంగా మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఒక యువతి లేదా యువకుడు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునేందుకు పేరును రిజిస్టర్ చేసుకుంటారు. ఇలా ఆధార‌ర‌హితంగా న‌మోదు అయ్యి మోసాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో  ఇక్క‌డే ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని కేంద్రం యోచిస్తోంది. ఇకపై వ‌ధు/వ‌రుల‌ రిజిస్ట్రేషన్ సమయంలో కచ్చితంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా పాన్ కార్డు లేదా పాస్‌పోర్టు లేదా ఏదైనా గుర్తింపు కార్డు నంబర్‌ను జతపరచాల్సి ఉంటుంది. త్వరలో కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల్లో ఈ నిబంధన ఉంటుంది. కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, న్యాయ శాఖలతోపాటు ఒక న్యాయ నిపుణుడితో సహా సభ్యులుగా కేంద్ర మహిళా సంక్షేమ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో ఒక నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆమోద‌ముద్ర ప‌డితే మాట్రిమోనియల్‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి అవుతుంది.

తిరుమలలో ‘బ్రహ్మోత్సవం’ గొడవేంటి?
బాలయ్య వందకి క్రిష్ కన్ఫర్మ్ అయ్యాడా..?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*